జనసేనకు ప్లస్ అవుతున్న పరిస్థితులు

YSRCP Party Winning-Graph Is Decreasing In Pendurthi Constituency, YSRCP Party Winning-Graph, YSRCP Graph Decreasing In Pendurthi Constituency, Pendurthi Constituency, Pendurthi, Chandrababu, Pawan Kalyan, Ramesh, Panchkarla Ramesh Babu, Bandaru Satyanarayana Murthy, TDP, Janasena, BJP, YCP, Lok Sabha Elections, Andhra Pradesh Elections, AP Political News, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
pendurthi,Chandrababu, Pawan Kalyan, Ramesh, Panchkarla Ramesh Babu, Bandaru Satyanarayana Murthy, TDP, Janasena, BJP, YCP

పెందుర్తి నియోజకవర్గం జనసేనకు అనుకూలంగా మారుతుందన్న టాక్ నడుస్తోంది. ప్రభుత్వం పట్ల పెరుగుతున్న వ్యతిరేకత, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అరాచకాలు, అక్రమాలు, అవినీతి జనసేనకు ప్లస్‌గా మారుతున్నాయన్న వాదన పెరుగుతోంది. అంతేకాదు ఈ నియోజక వర్గంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో ప్రధాన నేతలకు టికెట్లు, పదవులు రావడంతో వారివారి వర్గాలు కలసికట్టుగా పని చేయడం సానుకూలంగా మారింది.

విశాఖ పట్నం నగర శివారులోని అతి పెద్ద నియోజకవర్గమైన పెందుర్తి ఇప్పుడు అనకాపల్లి జిల్లాలోకి వెళ్లిపోయింది. పెందుర్తి వాసులు ఇప్పటి వరకు రెండో సారి ఎవరికీ అవకాశమివ్వలేదు. కాకపోతే ఈ సారి ఈ ఎన్నికలలో గతంలో ఇక్కడి నుంచే గెలిచిన అభ్యర్థులు ఇద్దరూ కూడా ఇప్పుడు పోటీ పడుతున్నారు. వైఎస్సార్పీపీ నుంచి ప్రస్తుత శాసనసభ్యుడు అన్నంరెడ్డి అదీప్ రాజ్ పోటీ పడుతుండగా.. కూటమి పొత్తులో భాగంగా జనసేన నుంచి మాజీ శాసన సభ్యుడు పంచకర్ల రమేష్ బాబు పెందుర్తి పోటీ చేస్తున్నారు.

మరోవైపు అనకాపల్లి ఎంపీ అభ్యర్దిగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సీఎం రమేష్ నిలబడంతో.. అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ ధైర్యం వచ్చినట్లు అయింది. ఆర్థికంగా అండదండలు ఉన్న నేతతో.. ఎంపీగా పని చేసిన సీఎం రమేష్‌కు కేంద్రంలో ఇప్పటికీ పలుకుబడి ఉండటంతో.. అధికారుల సహకారం కూడా కూటమికి ఉంటుంది. తాను గెలవడమే కాకుండా తనతో పాటు ఏడుమంది అసెంబ్లీ అభ్యర్థులను గెలిపిస్తానని పదే పదే ప్రకటిస్తూ అందుకు తగ్గట్టుగా వ్యూహం రచించడం వైసీపీకి మైనస్ అవుతోంది.

ఇటు టీడీపీ నుంచి పెందుర్తి స్థానాన్ని ఆశించిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తికి..లాస్ట్ మినిట్‌లో మాడుగుల టికెట్ కేటాయించడం పంచకర్ల రమేష్‌కు పెద్ద రిలీఫ్ ఇచ్చింది. టికెట్ ఖరారయ్యేంత వరకూ కూడా బండారు సత్యనారాయణ పంచకర్లకు ఏమాత్రం సహకరించకుండా అలకలోనే ఉన్నారు. చివరకు తనకు మాడుగుల టికెట్ కన్ఫామ్ అయిన తర్వాత ఏర్పాటు చేసిన సమావేశంలో పంచకర్లను గెలిపించాల్సిందిగా బండారు సత్యనారాయణ పిలుపు నిచ్చారు. పెందుర్తి నియోజక వర్గంలో కాపులు , కొప్పుల వెలమలు మెజారిటీలుగా ఉన్నారు. పంచకర్ల కాపు కాగా, బండారు కొప్పుల వెలమ అవడంతో.. వీరిద్దరి కలయిక ఇఫ్పుడు వర్కవుట్ అయ్యేటట్లు సీన్ కనిపిస్తుంది.

పెందుర్తి నియోజక వర్గానికి చెందిన మాజీ శాసనసభ్యుడు గండి బాబ్జీ ఐదు రోజుల క్రితం వరకూ.. విశాఖ దక్షిణ నియోజక వర్గ టీడీపీ ఇన్చార్జిగా ఉన్నారు. ఆ సీటు కూడా జనసేనకు వెళ్లడంతో టీడీపీ అధిష్టానం బాబ్జీని బుజ్జగించి విశాఖ అధ్యక్షుడిగా నియమించింది. అయితే, భవిష్యత్ రాజకీయ అవసరాల దృష్ట్యా తనను పెందుర్తి ఇన్చార్జిగా నియమించాల్సిందిగా కోరడంతో..అధిష్టానం అంగీకరించడం ఇప్పడు పంచకర్లకు అనుకూలంగా మారింది. అటు బండారు, ఇటు బాబ్జీ చెరోవైపు పంచకర్ల కోసం పని చేయడం జనసేనకు బోనస్ గా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − 3 =