రూ.1863 కోట్ల వ్యయంతో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్, సంపూర్ణ పోషణ పథకాలు

AP CM YS Jagan, AP CM YS Jagan Launches YSR Sampurna Poshana Schemes, AP YSR Sampoorna Poshana Plus Scheme, YS Jagan Launches YSR Sampurna Poshana Scheme, YSR Sampoorna Poshana, YSR Sampoorna Poshana Plus Scheme, YSR Sampurna Poshana Scheme, YSR Sampurna Poshana Scheme Nutrition Supplementation, YSR Sampurna Poshana Schemes

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెప్టెంబర్ 7, సోమవారం నాడు తన క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్, వైఎస్ఆర్‌ సంపూర్ణ పోషణ పథకాలను ప్రారంభించారు. ఈ పథకాలతో అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు బలవర్ధక ఆహారం అందించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని మొత్తం 55,607 అంగన్ వాడీల పరిధిలో రూ.1863.11 కోట్ల వ్యయంతో 30,16,000 మంది లబ్దిదారులకు ఈ పథకాలను అందించనున్నారు. 77 గిరిజన, సబ్‌ప్లాన్‌ మండలాల పరిధిలోని 8 ఐటీడీఏలు, 52 ఐసీడీఎస్‌ ప్రాజెక్టులతో పాటు 8,320 అంగన్‌వాడీ కేంద్రాల్లో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాన్ని అమలు చేయనున్నారు. అలాగే 77 గిరిజన మండలాలు మినహా మిగిలిన 47,287 అంగన్‌వాడీ కేంద్రాల్లో వైఎస్ఆర్‌ సంపూర్ణ పోషణ పథకాన్ని అమలు చేయనున్నారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, చిన్నారులకు పౌష్టికాహారం అందించడం కోసమే సంపూర్ణ పోషణ పథకాలను ప్రారంభించామని అన్నారు. రక్తహీనత, పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న గర్భిణీలు, బాలింతలుతో పాటుగా 6 నుంచి 72 నెలలలోపు పిల్లలకు ఈ పథకాల ద్వారా పౌష్టికాహారం అందిస్తామని చెప్పారు. తల్లులకు పోషణ, పిల్లలకు రక్షణగా ఈ పథకాలు మారనున్నాయని పేర్కొన్నారు. అలాగే ఇకపై అంగన్‌వాడీ కేంద్రాలను ప్రీ ప్రైమరీ కేంద్రాలుగా మార్చబోతున్నామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − 4 =