రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం

Latest news, Mango News Telugu, muslim, muslim women, Parliament Passes Triple Talag Bill, rajya sabha, Rajya Sabha Approves Triple Talaq Bill 2019, today news, triple talaq, Triple Talaq Bill, Triple Talaq Bill 2019, Triple Talaq Bill Approved, triple talaq bill in rajya sabha, triple talaq bill latest news, triple talaq bill passed, triple talaq bill passed in rajya sabha, triple talaq bill rajya sabha, triple talaq debate, triple talaq news, triple talaq rajya sabha, triple talaq verdict

జూలై 30న రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం పొందింది. బిల్లు ఆమోదం కోసం మోడీ ప్రభుత్వం అనుసరించిన విధానాలు ఫలితాన్నిచ్చాయి.ఈ బిల్లుకు అనుకూలంగా 99 ఓట్లు రాగా, వ్యతిరేఖముగా 84 ఓట్లు వచ్చాయి. రాజ్యసభలో తగినంత బలం లేకపోయినా బీజేపీ ప్రభుత్వం ఈ బిల్లును వ్యూహాత్మకంగా ఆమోదింపజేసుకుంది. కొన్ని పార్టీలు ఓటింగుకు దూరంగా ఉండడం, కొంతమంది సభ్యులు బిల్లు మీద అయిష్టతతో వాకౌట్ చేయడం, చివర్లో బీజేడీ మద్దతు తెలపడంతో ప్రభుత్వానికి కలిసివచ్చింది. జూలై 25 న బిజెపి లోక్‌సభలో ట్రిపుల్ తలాక్ బిల్లును ప్రవేశపెట్టి, 303 అనుకూల ఓట్లతో బిల్లును ఆమోదించింది. ఇప్పుడు రాజ్యసభలో కూడ ఆమోదం పొందడంతో బిల్లు త్వరలోనే రాష్ట్రపతి దగ్గరకు వెళ్లనుంది, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదం తరువాత చట్టంగా మారి అమల్లోకి వస్తుంది.

అయితే ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదించబడటానికి ముందు, కాంగ్రెస్ పార్టీ, మరియు ఇతర ప్రతిపక్షాలు ఈ బిల్లును వ్యతిరేకించాయి, తలాక్ ఇచ్చిన వ్యక్తికీ మూడు సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించే నిబంధనను తొలిగించాలని ప్రతిపక్షాలు పట్టుపట్టాయి మరియు పరిశీలన కోసం బిల్లును పార్లమెంటరీ సెలెక్ట్ కమిటీకి పంపమని డిమాండ్ చేసారు. ప్రతిపక్షాల సవరణలను కమిటీకి పంపే నిర్ణయం ఓట్ల ద్వారా నిర్ణయించబడింది, ఈ నిర్ణయాన్ని 100 మంది వ్యతిరేకించగా, 84 మంది మాత్రమే ఈ ప్రతిపాదనకు మద్దతు ఇచ్చారు. నాలుగున్నర గంటల చర్చ తరువాత మోడీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ట్రిపుల్ తలాక్ బిల్లు రాజ్య సభలో ఆమోదం పొందింది.

 

[subscribe]
[youtube_video videoid=5axMB69_RD8]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + 5 =