నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లుపై వైద్యులు ఆందోళన

Doctors Go On Strike Against NMC Bill 2019,nmc bill, lok sabha, national medical commission bill, telugu news, indian medical association, national medical commission, doctors, latest news, medical council of india, medical education, doctors on strike,national news,national political news,latest updates,doctors strike,IMA Calls Strike Against Passage of NMC Bill

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసి) బిల్లు 2019 ను వ్యతిరేకిస్తూ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) నిర్ణయం మేరకు 24 గంటల పాటు దేశవ్యాప్తంగా వైద్యులు ఆందోళనకు దిగారు. జూలై 30న ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఎ. సుబ్రహ్మణేశ్వరరావు విలేకరుల సమావేశంలో ప్రసంగించి సమ్మెను ప్రకటించారు. ఈ బిల్లుని వెంటనే రద్దు చేయాలనీ డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడ వైద్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ మరియు గుంటూరు నగరాల్లో అనేక ఆసుపత్రులు ముందు వైద్యులు విధులు బహిష్కరించి ధర్నా చేస్తున్నారు, కేవలం అత్యవసర సేవలకు మాత్రమే హాజరవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.

మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసిఐ) కు బదులుగా నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసి) ఏర్పాటు చేయడం వెనుక అలోపతి వైద్యాన్ని దెబ్బతీసే ఉద్దేశం ఉందని వైద్యులు విమర్శిస్తున్నారు. ఎంబీబీస్ పూర్తీ చేసిన విద్యార్థులు పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రవేశాలకు, మెడిసిన్ ప్రాక్టీస్ చేయడానికి లైసెన్స్ కోసం నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ రాయాలనడం వైద్య విద్యార్థులకు అనుకూలం కాదని వైద్యులు భావిస్తున్నారు. కేవలం జూనియర్ వైద్యులు పైనే కాకుండ, సామాన్య రోగులు, వైద్యవిద్యార్థుల పై కూడ ఈ బిల్లు ప్రభావం చూపిస్తుందని అనుభవ వైద్యులు చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడ ఈ బిల్లుకు ఒప్పుకోమని, ఉపసంహరించుకునే దాకా పోరాటం చేస్తామని ఐఎంఏ సభ్యులు పేర్కొన్నారు.

 

[subscribe]
[youtube_video videoid=rKBMINkYZNE]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × three =