మంచి స్క్రిప్ట్ కుదిరితే బాలీవుడ్ సినిమాల్లో నటిస్తా – అల్లు అర్జున్

Icon Star Allu Arjun Comments Over Bollywood Entry, Icon Star, Icon Star Allu Arjun, Allu Arjun, Bollywood Entry, Allu Arjun Comments, Icon Star Comments, Stylish Star, Stylish Star Allu Arjun, Movie News, Movie Live Updates, TollyWood, TollyWood Latest News, TollyWood Live Updates, Mango News, Mango News Telugu,

మంచి స్క్రిప్ట్ కుదిరితే బాలీవుడ్ సినిమాల్లో నటిస్తా అని అన్నారు అల్లు అర్జున్. టాలీవుడ్ లో అద్భుతమైన డ్యాన్స్ ల‌తో యూత్‌ను మెస్మరైజ్ చేసి ఐకాన్ స్టార్‌గా ఎదిగిన హీరో అల్లు అర్జున్. తాజాగా అతడు హీరోగా నటించిన పాన్ ఇండియా చిత్రం ‘ పుష్ప’. టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప మూవీ దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డులను తిరగ రాస్తోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్పరాజ్ అనే స్మగ్లర్ పాత్రలో నటించారు. తాజాగా అల్లు అర్జున్ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో బాలీవుడ్ ఎంట్రీ గురించి కూడా కామెంట్స్ చేశారు.

బాలీవుడ్‌లో చాలా మంచి దర్శకులున్నారు. మంచి స్క్రిప్ట్ తో ఏ దర్శకుడు వచ్చినా తప్పకుండా నటిస్తాను. మంచి ప్రాజెక్టులో భాగం కావాలని నాకు ఉంది. అయితే, ఇప్పటి వరకు ఎవరూ నన్ను సంప్రదించలేదు. ఏ ప్రాజెక్టు అయినా ఓకే చేస్తే తప్పకుండా చెప్తాను. కానీ, ఇప్పటి వరకు ఏది కూడా ఫైనలైజ్ కాలేదు అని అన్నారు అల్లు అర్జున్. నాకు స్క్రిప్ట్ అనేది చాలా ముఖ్యం. స్క్రిప్ట్ డిమాండ్ మేరకు ఎవరితో అయినా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాను. నాకు వ్యక్తిగతంగా ఇష్టమైనవారు ఎవరు లేరు అని చెప్పారు బన్నీ. మరో 2 నెలల్లో పుష్ప 2 షూటింగ్‌ను ప్రారంభిస్తామన్నారు. షూటింగ్ మొదలవ్వడానికి ఇంకా టైం ఉండటంతో ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నానని స్పష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + three =