కోహ్లి ప్రపంచ స్థాయి ఆటగాడు – డేవిడ్‌ వార్నర్‌

Australia Opener David Warner Praises and Supports Virat Kohli, Australia Opener David Warner, David Warner, David Warner Praises, David Warner Supports, Virat Kohli, Virat Kohli Latest News, Virat Kohli Live Updates, Cricket, Cricket Updates, Cricket Live Updates, Australia Opener, Praises and Supports, Mango News, Mango News Telugu,

టీమిండియా టెస్ట్‌ కెప్టెన్‌ విరాట్ కోహ్లి ఫామ్ విషయంలో ఆందోళన అనవసరం అని ఆస్ట్రేలియా స్టార్‌ ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌ అభిప్రాయపడ్డాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లి సెంచరీ సాధించి రెండేళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలోనే.. అతను వన్డే కెప్టెన్సీని కోల్పోవడంతో పాటు ఎన్నో విమర్శలను ఎదుర్కొంటున్నాడు. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అతని ర్యాంకు దిగజారుతోంది. ఈ నేపథ్యంలో కోహ్లికి జట్టులో చోటు సైతం ప్రశ్నార్ధకంగా మారింది. బ్యాటింగ్‌ పరంగా విరాట్ కోహ్లి ప్రస్తుతం గడ్డు పరిస్థితలను ఎదుర్కొంటున్నప్పటికీ, అతను కొత్తగా నిరూపించుకోవాల్సిందేమీ లేదని వార్నర్‌ అన్నాడు.

తన అద్భుత బ్యాటింగ్‌ నైపుణ్యంతో ఎన్నో వ్యక్తిగత రికార్డులతో పాటు టీమిండియాకు చిరస్మరణీయ విజయాలు అందించిన విషయాన్ని గుర్తుచేశాడు డేవిడ్‌ వార్నర్. టీమిండియా రన్‌ మెషీన్ విరాట్ ‌కు బ్యాటింగ్‌లో విఫలమయ్యే హక్కు, అధికారం రెండూ ఉన్నాయని అభిప్రాయపడ్డాడు. ప్రతి ఆటలో ఆటగాడు ఫామ్‌ కోల్పోవడం అనేది చాలా సహజమని, కోహ్లి విషయంలోనూ అదే జరిగిందని వార్నర్‌ అన్నాడు. అయితే, మైదానంలోకి దిగిన ప్రతిసారీ యంత్రంలా పరుగులు చేసేందుకు కోహ్లి ఏమీ రోబో కాదని డేవిడ్‌ వెనకేసుకొచ్చాడు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + 3 =