నేటినుంచి ప్రారంభమవనున్న తెలుగు ‘బిగ్ బాస్’ సీజన్-6.. మరోసారి హోస్ట్‌గా హీరో నాగార్జున

Tollywood Hero Akkineni Nagarjuna Hosting Telugu Bigg Boss Season 6 To be Started Today, Telugu Bigg Boss Season 6 Started, Bigg Boss Season 6 , Akkineni Nagarjuna Host Bigg Boss Season 6, Telugu Bigg Boss , Mango News, Mango News Telugu, Bigg Boss Season 6 Latest News And Updates,Tollywood Hero Akkineni Nagarjuna, Bigg Boss Host Akkineni Nagarjuna, King Nagarjuna, Bigg Boss News And Live Updates

బుల్లితెర రియాలిటీ షో ‘బిగ్ బాస్’ ప్రోగ్రాం రెండు తెలుగు తెలుగు రాష్ట్రాల్లో ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పటికి ఈ తెలుగు బిగ్ బాస్ ఐదు సీజన్స్‌ను పూర్తి చేసుకుంది. నేటినుంచి 6వ సీజన్ మొదలవనుంది. మరికొన్ని గంటల్లో బిగ్‏బాస్-6 సందడి ప్రారంభం కానుంది. ఇప్పటికే బిగ్ బాస్ హౌస్‌ను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. సీజన్‌-3 నుంచి హోస్ట్‌గా వ్యవహరించిన ప్రముఖ టాలీవుడ్ అగ్ర హీరో అక్కినేని నాగార్జున ఈ సీజన్‌కు కూడా హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఇక ఈ రియాలిటీ షో ఆదివారం సాయంత్రం గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. ఇక ఇప్పటికే నెట్టింట బిగ్‏బాస్ సందడి ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతోంది. ఈసారి షోలో పాల్గొనబోతున్న కంటెస్టెంట్లు వీళ్లేనంటూ ఓ లిస్ట్‌ కూడా చక్కర్లు కొడుతోంది.

అయితే ప్రారంభానికి ముందే ఈ షోలో పాల్గోనే కంటెస్టెంట్ జాబితా ఇదే అంటూ సోషల్‌ మీడియాలో ఒక లిస్ట్ వైరల్ అవుతోంది. దీని ప్రకారం.. సింగర్‌ రేవంత్‌, నటుడు బాలాదిత్య, జబర్దస్త్ కమెడియన్‌ చంటి, గీతూ రాయల్‌, ఆది రెడ్డి, సిరి బాయ్‌ఫ్రెండ్‌ శ్రీహాన్‌, యాంకర్‌ నేహా చౌదరి, ఆర్జే సూర్య, నటి సుదీప (పింకీ), యాంకర్‌ ఆరోహీ రావ్‌, సీరియల్‌ నటి శ్రీ సత్య, కీర్తి, ఇనయా సుల్తానా (ఆర్జీవీ వీడియోతో పాపులర్‌), జబర్దస్త్ లేడీ కమెడియన్‌ ఫైమా, నటి వసంతి, అర్జున్‌, రాజశేఖర్‌, రియల్‌ కపుల్‌ రోహిత్‌, మరీనాలు ఉన్నారు. వీరితో పాటు ఇద్దరు లేదా ముగ్గురు కామన్ పీపుల్ కూడా ఈసారి బిగ్‌బాస్‌ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. కాగా బిగ్ బాస్ తెలుగు సీజన్-5లో షణ్ముఖ్ ఫస్ట్ రన్నరప్‌గా, శ్రీరామ చంద్ర సెకండ్ రన్నరప్‌గా నిలవగా.. విజేత సన్నీ ట్రోఫీతో పాటు రూ. 50 లక్షల ప్రైజ్ మనీ కూడా గెలుచుకోవడం తెలిసిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + 18 =