రూ. 2వేల కరెన్సీ నోట్లను రద్దు చేయాలి.. రాజ్యసభలో బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ కీలక వ్యాఖ్యలు

2000 Rupee Currency Notes Should be Phased Out BJP MP Sushil Modi Says in Rajya Sabha,2000 Rupee Currency Notes,BJP MP Sushil Modi,Rajya Sabha MP Sushil Modi,Mango News,Mango News Telugu,Prime Minister Narendra Modi, Narendra Modi News and Updates,PM Modi Latest News and Updates,PM Modi,Prime Minister Modi,Indian Prime Minister Modi Latest News and Updates, Gujarat Assembly Elections,Assembly Elections In Gujarat, Gujarat Assembly Poll,Gujarat Assembly News And Live Updates,

బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా చెలామణీలో ఉన్న 2,000 రూపాయల కరెన్సీ నోట్లను రద్దు చేయాలని అన్నారు. ఈ మేరకు ఆయన రాజ్యసభలో జీరో అవర్ సందర్భంగా మాట్లాడుతూ.. 2,000 రూపాయల కరెన్సీ నోట్లను దశలవారీగా రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2,000 రూపాయల నోట్లను కలిగి ఉన్న పౌరులు దానిని బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి ఇప్పటినుంచి రెండేళ్ల సమయం ఇవ్వాలని కూడా సుశీల్ సూచించారు. ఈలోపు కేంద్రం క్రమంగా ఈ నోట్ల రద్దును కొనసాగించాలని అన్నారు. కాగా ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం రూ.500 మరియు రూ.1,000 నోట్లను అధికారికంగా రద్దు చేసిన విషయం తెలిసిందే. దేశంలో నకిలీ కరెన్సీ నోట్లు, టెర్రర్ ఫైనాన్సింగ్, నల్లధనం మరియు పన్ను ఎగవేతల వంటి వాటిని దీనికి ప్రధాన కారణంగా పేర్కొంది.

అనంతరం రూ.2,000 నోట్లను అదే సంవత్సరం నవంబరులో ప్రవేశపెట్టారు. దీనితో పాటు కొత్త రూ.500 నోటుని కూడా చెలామణీలోకి తీసుకొచ్చారు. ఇక కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు చేసిన ఆరేళ్ల తర్వాత కూడా ప్రజల వద్ద ఉన్న కరెన్సీ అత్యధిక స్థాయిలో ఉందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది అక్టోబర్ 21 నాటికి పబ్లిక్‌ వద్ద కరెన్సీ గరిష్టంగా రూ.30.88 లక్షల కోట్లకు చేరుకున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. కాగా పబ్లిక్‌ వద్ద ఉన్న కరెన్సీ అనేది ప్రజలు లావాదేవీలు జరపడానికి, లావాదేవీలను పరిష్కరించుకోవడానికి మరియు వస్తువులు మరియు సేవలను కొనుగోలు చేయడానికి ఉపయోగించే నోట్లు మరియు నాణేలను సూచిస్తుంది. మధ్యలో కరోనా మహమ్మారి కారణంగా ప్రజలు డిజిటల్ చెల్లింపుల ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారించినప్పటికీ, ఆర్థిక వ్యవస్థలో నగదు వినియోగం కూడా క్రమంగా పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × five =