ప్రముఖ నటుడు కమల్​ హాసన్​ కు స్వల్ప అస్వస్థత

Famous Actor Kamal Haasan Admitted To Chennai Hospital Due To Ill Health,Famous Actor Kamal Haasan Is Unwell,Kamal Haasan Admitted To Chennai Hospital,Kamal Haasan Got Ill Health,Mango News,Mango News Telugu,Kamal Haasan Latest News And Updates,Actor Kamal Haasan,Kamal Haasan Movies,Kamal Haasan New Movies,Kamal Haasan Movies 2022,Vikram New Movie 2022,Kamal Haasan Vikram,Kamal Haasan Movies List,Kamal Haasan Telugu Movies,Kamal Haasan Health Updates

ప్రముఖ నటుడు కమల్​ హాసన్​ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో నవంబర్ 23, బుధవారం నాడు చెన్నై లోని శ్రీరామచంద్ర మెడికల్ సెంటర్ లో చేరి చికిత్స తీసున్నారు. జ్వరం, దగ్గు, జలుబు మరియు సాధారణ ఆరోగ్య పరీక్షల కోసమే కమల్ హాసన్ ఆసుపత్రికి వెళ్లినట్టు తెలుస్తుంది. కాగా కమల్ హాసన్ కోలుకుంటున్నారని, ఆసుపత్రి నుంచి రెండ్రోజుల్లో డిశ్చార్జ్ కానున్నట్టు వైద్యులు తెలిపారు. డిశ్చార్జ్ అనంతరం కొద్ది రోజుల పాటు ఆయన విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంది.

మరోవైపు కమల్ హాసన్ బుధవారం నాడు హైదరాబాద్ కు వచ్చిన సందర్భంగా తన గురువు, దిగ్గజ దర్శకుడు కె.విశ్వనాథ్‌ ను కలుసుకున్నారు. హైదరాబాద్ నుంచి తిరిగివెళ్లిన అనంతరం స్వల్ప అస్వస్థత గురవడంతో, ఆయన ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. కమల్ హాసన్ ప్రస్తుతం ఇండియన్-2 సినిమా చిత్రీకరణ మరియు బిగ్ బాస్ తమిళ సీజన్ 6 హోస్ట్‌గా బిజీగా ఉన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here