ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు గెలుచుకున్న ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్

England Star Batter Jos Buttler Won The Icc Men's Player Of The Month For November 2022,England Star Batsman Jos Buttler,Jos Buttler Won Icc Player Of Month Award,Icc Player Of Month Award,Mango News,Mango News Telugu,Jos Buttler England Batsman,England Batsman Jos Buttler,Jos Buttler Icc Player Of Month Award,Cricket Match,Cricket Live,Icc Cricket Live,Live Cricket Match Today,Cricket England Players,England Cricket Players 2022,England Cricket Team Players,England Cricket Team T20,England Cricket Team,England Cricket Team Captain,England Cricket News

ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్, టీ20 కెప్టెన్ జోస్ బట్లర్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) “ప్లేయర్ అఫ్ ది మంత్” అవార్డుకు ఎంపికయ్యాడు. టీ20 ప్రపంచకప్-2022 టైటిల్ ను ఇంగ్లాండ్ జట్టు కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించిన జోస్ బట్లర్ 2022, నవంబర్ నెలకు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకున్నాడు. టీ20 ప్రపంచకప్ లో భారత్ తో జరిగిన సెమీఫైనల్‌ లో బట్లర్ ఓపెనింగ్ వికెట్‌కు అలెక్స్ హేల్స్‌తో కలిసి అజేయంగా 170 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. కేవలం 49 బంతుల్లో తొమ్మిది ఫోర్లు మరియు మూడు సిక్స్‌లతో 80 పరుగులు చేసి టోర్నమెంట్‌లో ఇంగ్లాండ్ ను ఫైనల్‌ లోకి చేర్చగా, అక్కడ ఇంగ్లాండ్ పాకిస్తాన్‌ను ఓడించి టీ20 ఛాంపియన్‌గా నిలిచింది. అలాగే నవంబర్ నెలలో జోస్ బట్లర్ ఆడిన నాలుగు టీ20 మ్యాచ్ లలో రెండింటిలో హాఫ్ సెంచరీలు చేశాడు. నామినేషన్స్ లో ఇంగ్లాండ్ కు చెందిన అదిల్ రషీద్, పాకిస్తాన్ కు చెందిన షాహీన్ అఫ్రిదీ కూడా ఉన్నప్పటికీ ఓటింగ్ లో వారిని ఓడించి జోస్ బట్లర్ ఈ అవార్డు దక్కించుకున్నట్టు ఐసీసీ తెలిపింది.

ఈ అవార్డును గెలుచుకోవడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని జోస్ బట్లర్ తెలిపాడు. నవంబర్‌లో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌ గా తనకు ఓటు వేసినందుకు అభిమానులకు ధన్యవాదాలు తెలియజేశాడు. మరోవైపు నవంబర్, 2022 నెలకు గానూ ఐసీసీ ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును పాకిస్థాన్ ఓపెనర్ సిద్రా అమీన్ గెలుచుకుంది. నవంబర్ లో స్వదేశంలో ఐర్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అమీన్ 277 పరుగులు చేసింది. నామినేషన్స్ లో ఐర్లాండ్ కు చెందిన గాబీ లెవీస్ మరియు థాయిలాండ్ కు చెందిన నత్తకాన్ చంతమ్ నుంచి పోటీ ఎదుర్కున్న సిద్రా అమీన్, ముందంజలో నిలిచి ఈ అవార్డు దక్కించుకున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here