కుల్ భూషణ్ మరణ శిక్ష నిలిపివేయమన్న అంతర్జాతీయ న్యాయస్థానం

ICJ asks Pakistan to Review Kulbhushan Jadhav Death Sentence, ICJ Rules in Favour of India, ICJ stays execution, Kulbhushan Jadhav Case, Kulbhushan Jadhav Case Latest News Updates, Kulbhushan Jadhav Case Live Updates, Kulbhushan Jadhav verdict ICJ grants consular access to India, Mango News, Pakistan must review Kulbhushan Jadhav’s death sentence, Review death sentence to Kulbhushan Jadhav

భారత మాజీ నౌకాదళ అధికారి కుల్ భూషణ్ జాదవ్ కేసులో బుధవారం అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. కుల్ భూషణ్ జాదవ్ కు విధించిన మరణశిక్షను సమీక్షించాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని జూలై 17 న అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసిజె) ఆదేశించింది. ఈ కేసులో విధించిన ఉరిశిక్షను పాకిస్తాన్ సమర్థవంతంగా సమీక్షించి, పునః పరిశీలించే వరకు సస్పెండ్ చేయాలి అని ఐసిజె ఆదేశాలు జారీ చేసింది. పాకిస్తాన్ కి పట్టుబడిన కుల్ భూషణ్ జాదవ్ ను, గూఢచర్యానికి, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడనే ఆరోపణలతో పాకిస్తాన్ సైనిక న్యాయస్థానం 2017 ఏప్రిల్ లో మరణ శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై భారతదేశం అభ్యంతరం వ్యక్తం జేస్తూ, పాక్ వైఖరి పై 2017 మే 8న అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

జూలై 17న ఐసిజె ఈ కేసును విచారించి తీర్పును పునః పరిశీలించాలని పాకిస్తాన్ కోర్టును ఆదేశించింది. ఈ కేసును ఐసిజె లోని 16 మంది న్యాయమూర్తుల ధర్మాసనం సమీక్షించింది, 15 మంది న్యాయమూర్తులు భారతదేశానికి అనుకూలంగా రూలింగ్ ఇచ్చారు, ఇక పాకిస్తాన్ కి అనుకూలంగా ఉన్న న్యాయవాది ఒక్కరు కూడ, ఆ దేశస్తుడే కావడం విశేషం. భారత్ కు న్యాయవాదిని నియమించుకునే హక్కు ఉందని ఐసిజె స్పష్టం చేసింది, అయితే జాదవ్ ని విడుదల చేయాలన్న భారత అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. ఈ కేసు చట్టపరంగా భారతదేశానికి పెద్ద విజయం.

ప్రధాని నరేంద్ర మోడీ ఐసిజె తీర్పును స్వాగతించారు, ఈ తీర్పుతో సత్యం, న్యాయం నిరూపితమయ్యాయని చెప్పారు. మాజీ విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్, ప్రస్తుత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేసారు. ఇది ప్రధాని మోడీ దౌత్య విజయమని కొనియాడారు. తీర్పు భారత్ కు అనుకూలంగా రావడంతో పలువురు ప్రముఖులు, ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేసారు.

 

 

[subscribe]
[youtube_video videoid=I1YAEkYaaCs]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × four =