లక్షకు పైగా మెజార్టీతో ఎంపీగా గెలిచిన క్రికెటర్

A Cricketer Who Won As An MP With A Majority Of More Than One Lakh, A Cricketer Who Won As An MP, A Cricketer As An MP With A Majority, Bangladesh Elections, Parliament Elections, Shakib Al Hasan, Latest Cricketer MP News, Cricketer As MP News, MP News Bangladesh, Bangladesh Elections News, Bangladesh Elections 2024, Bangladesh, Bangladesh Parliament Elections, Mango News, Mango News Telugu
Bangladesh elections, Parliament elections, shakib al hasan

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ బంగ్లాదేశ్ కెప్టెన్, ఆల్ రౌండర్ షకీబల్ హసన్. నిత్యం ఏదో ఒక వివాదంలో చిక్కుకొని వార్తల్లోకి ఎక్కుతుంటారు. తోటి ఆటగాళ్లతో వివాదాలు.. అభిమానులపై దాడి.. అంపైర్‌లతో దరుసుతనంతో నిత్యం ఏదో ఒక కాంట్రవ్రసీలో చిక్కుకుంటుంటారు. అయితే మరోసారి షకీబుల్ హసన్ వార్తల్లోకి ఎక్కారు. కానీ ఈసారి వివాదాలతో కాదు.. సార్వత్రి ఎన్నికల్లో గెలుపొంది వార్తల్లోకి ఎక్కారు. అధికూడా ఎవరూ ఊహించని విధంగా లక్షకు పైగా మెజార్టీతో షకీబుల్ హసన్ గెలుపొందారు. త్వరలో బంగ్లాదేశ్ పార్లమెంట్‌లో ఎంపీగా అడుగుపెట్టబోతున్నారు.

వన్డే వరల్డ్ కప్ అనంతరం షకీబుల్ హసన్ తన పొలిటికల్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీలో చేరారు. ఆదివారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మగుర-1 పార్లమెంట్ నియోకవర్గం నుంచి పోటీ చేసి షకీబుల్ విజయం సాధించారు. తన ప్రత్యర్ధి బంగ్లాదేశ్ కాంగ్రెస్ పార్టీకి చెందిన  రెజౌల్ హసన్‌ను చిత్తు చిత్తుగా ఓడించి లక్షా యాభై వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో షకీబుల్‌కు 1,85,388 ఓట్లు రాగా.. రెజౌల్ హసన్‌కు 45,933 ఓట్లు పోలయ్యాయి.

ఇకపోతే బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి అవామీ లీగ్ పార్టీ గెలుపొందింది. మూడింట రెండు వంతుల మెజార్టీని అవామీ లీగ్ పార్టీ సాధించింది. ప్రధాని షేక్ హసీనా గోపాల్‌గంజ్-3 నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో విజయం సాధించారు. తన ప్రత్యర్థి బంగ్లాదేశ్ సుప్రీం పార్టీ అభ్యర్థి నిజాముద్దీన్‌ లష్కర్‌ను హసీనా చిత్తుచిత్తుగా ఓడించారు. హసీనాకు 2,49,965 ఓట్లు పోలవ్వగా.. నిజాముద్దీన్‌కు కేవలం 469 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. దీంతో షేక్ హసీనా వరుసగా నాలుగోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించడం ఖరాయింది.

బంగ్లాదేశ్‌లో మొత్తం 300 పార్లమెంట్ స్థానాలు ఉండగా.. అందులో 299 స్థానాలకు ఎన్నికలు జరిగాయి.  ఈసారి 17 పార్టీల నుంచి 1500 మందికిపైగా అభ్యర్థులు.. స్వతంత్రంగా 436 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేశారు. ఈసారి ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ సహా మొత్తం 15 పార్టీలు ఎన్నికలను బహిష్కరించాయి. దీంతో పోలింగ్ కూడా అతి తక్కువ కేవలం 40 శాతం మాత్రమే నమోదయింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 12 =