తెలంగాణలో స్పీడ్ పెంచిన బీజేపీ

BJP Increased Speed In Telangana, BJP Increased Speed, In Telangana BJP Increased Speed, Telangana BJP, Kishan Reddy, BJP, Lok Sabha Elections, Latest BJP News, Telangana BJP News, Modi, Bandi Sanjay, Parliament, TS CM Revanth Reddy, Polictical News, Elections, Mango News, Mango News Telugu
Telangana BJP, Kishan reddy, BJP, Lok sabha elections

అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయో లేదో తెలంగాణలో లోక్ సభ ఎన్నికల హడావుడి మొదలయింది. ప్రధాన పార్టీలన్నీ లోక్ సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టేశాయి. ఇప్పటికే గెలుపు గుర్రాల వేటలో పడ్డాయి. బలమైన అభ్యర్థులను బరిలోకి దింపేందుకు కసరత్తు చేస్తున్నాయి. తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాల్లో మెజార్టీ స్థానాలను దక్కించుకోవాలని అధికార కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు మొదలు పెట్టింది. అటు తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ.. లోక్ సభ ఎన్నికల్లో 10కి పైగా స్థానాలను దక్కించుకొని ఢిల్లీలో చక్రం తిప్పాలని భావిస్తోంది. అటు భారతీయ జనతా పార్టీ కూడా తెలంగాణపై కోటి ఆశలు పెట్టుకుంది. మెజార్టీ స్థానాలను దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది.

ఈక్రమంలో తాజాగా తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో లోక్ సభ ఎన్నికల వేళ అనుసరించాల్సిన వ్యూహాలు.. ఎన్నికల ప్రచారం ఎలా నిర్వహించాలి.. ఎక్కడెక్కడ పార్టీకి బలం తక్కువగా ఉంది అనే అంశాలపై నేతలు చర్చలు జరిపారు. అలాగే తెలంగాణలోని మొత్తం 17 లోక్ సభ స్థానాలకు ఇంఛార్జ్‌లను కిషన్ రెడ్డి నియమించారు. 8 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీకి ఇంఛార్జ్‌లుగా బాధ్యతలు అప్పగించారు.

వరంగల్ లోక్‌సభ స్థానం ఇంఛార్జ్‌గా మర్రి శశిధర్ రెడ్డిని.. ఖమ్మం లోక్‌సభ స్థానం ఇంఛార్జ్‌గా పొంగులేటి సుధాకర్ రెడ్డిని.. మహబూబాబాద్ లోక్‌సభ స్థానం ఇంఛార్జ్‌గా  గరికపాటి మోహనరావును.. ఆదిలాబాద్ లోక్‌సభ స్థానం ఇంఛార్జ్‌గా  పాయల్ శంకర్‌ను.. కరీంనగర్ లోక్‌సభ స్థానం ఇంఛార్జ్‌గా సూర్యనారాయణను.. పెద్దపల్లి లోక్‌సభ స్థానం ఇంఛార్జ్‌గా  రామారావు పాటిల్‌ను.. నిజామాబాద్ లోక్‌సభ స్థానం ఇంఛార్జ్‌గా ఏలేటి మహేశ్వరరెడ్డిని.. జహీరాబాద్ లోక్‌సభ స్థానం ఇంఛార్జ్‌గా కాటిపల్లి వెంకటరమణారెడ్డిని కిషన్ రెడ్డి నియమించారు.

అలాగే మల్కాజ్‌గిరి ఇంఛార్జ్‌గా పైడి రాకేశ్ రెడ్డిని.. మెదక్ ఇంఛార్జ్‌గా పాల్వాయి హరీశ్ బాబు.. సికింద్రాబాద్ ఇంఛార్జ్‌గా కె.లక్ష్మణ్‌ను.. హైదరాబాద్ ఇంచార్జ్‌గా రాజాసింగ్‌ను.. మహబూబ్‌నగర్ ఇంచార్జ్‌గా రామచంద్రరావును.. చేవెళ్ల ఇంఛార్జ్‌గా ఏవీఎన్ రెడ్డిని.. నల్లగొండ ఇంచార్జ్‌గా చింతల రామచంద్రారెడ్డి.. నాగర్ కర్నూల్ ఇంఛార్జ్‌గా మాగం రంగారెడ్డిని.. భువనగిరి ఇంఛార్జ్‌గా ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్‌లకు ఇంఛార్జ్‌గా కిషన్ రెడ్డి బాధ్యతలు అప్పగించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − 11 =