నేతాజీ జయంతి : పరాక్రమ దివస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ

125th Birth Anniversary of Netaji Subhas Chandra Bose, 125th Birth Anniversary of Netaji Subhas Chandra Bose in Kolkata, kolkata, Mango News, modi, Modi Attends 125th Birth Anniversary of Netaji Subhas Chandra Bose, Netaji Subhas Chandra Bose, Netaji Subhas Chandra Bose Birth Anniversary, Netaji Subhas Chandra Bose News, pm narendra modi, President Kovind unveils Netaji Subhas Chandra Bose portrait

స్వాతంత్య్ర సమరయోధుడు, భారత జాతీయ సైన్యం వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ 125వ జయంతి సందర్భంగా శనివారం నాడు కోల్‌కతాలోని విక్టోరియా మెమోరియల్‌లో నిర్వహించిన ‘పరాక్రమ దివాస్’ వేడుకల కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, గవర్నర్‌ జగదీప్‌ ధన్‌కర్‌, పలువురు నాయకులు కూడా హాజరయ్యారు. నేతాజీ 125వ జయంతిని పురస్కరించుకుని స్మారక నాణెం మరియు తపాలా బిళ్ళను ప్రధాని మోదీ విడుదల చేశారు. నేతాజీ ఇతివృత్తం ఆధారంగా “అమ్రా నూటన్ జౌబోనేరి డూట్” అనే సాంస్కృతిక కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఈ రోజు స్వతంత్ర భారతదేశ కలకి కొత్త దిశానిర్దేశం చేసిన భరతమాత ముద్దుబిడ్డ పుట్టినరోజుని పేర్కొన్నారు. నేతాజీ 125 వ జయంతి వార్షికోత్సవాన్ని ఈ రోజు నుండి జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో జరుపుకోవాలని కేంద్రం నిర్ణయించినట్టు తెలిపారు. జనవరి 23 వ తేదీని ప్రతి సంవత్సరం ‘పరాక్రమ దివస్‌’గా జరుపుకుంటామని పేర్కొన్నారు. నేతాజీ భారతదేశం యొక్క శక్తి మరియు ప్రేరణ యొక్క స్వరూపమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 2018 లో ప్రభుత్వం అండమాన్ ద్వీపానికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీపం అని పేరు పెట్టడం తన అదృష్టమని ప్రధాని పేర్కొన్నారు. అలాగే దేశ భావాలను గౌరవిస్తూ, నేతాజీకి సంబంధించిన ఫైళ్ళను కూడా ప్రభుత్వం బహిరంగపరిచిందని అన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ కలతో పాటుగా సోనార్ బంగ్లాకు కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్ పెద్ద ప్రేరణ అని అన్నారు. దేశానికి స్వేచ్ఛ తేవడంలో నేతాజీ పోషించిన పాత్రను, ఆత్మనిర్భర్ భారత్ సాధించడంలో పశ్చిమ బెంగాల్ కూడా కీలక పాత్ర పోషించాలని ప్రధాని మోదీ కోరారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + 5 =