ఆసియాక‌ప్ టేబుల్ టెన్నిస్-2022: భార‌త క్రీడాకారిణి మ‌నికా బ‌త్రా సంచ‌ల‌నం, కాంస్య‌ ప‌త‌కం కైవసం

Asian Cup-2022 Manika Batra Creates History as First Indian Female To Win Bronze at Asian Table Tennis Event,Asia Cup Table Tennis-2022, Manika Batra wins bronze medal,Asian Table Tennis Event,Mango News,Mango News Telugu,sports news,sports news today,indian sports news today,indian sports women,indian sports men,famous sports women,sports players of india,Indian sports players,indian tennis players,indian cricket team players,indian sports famous players,famous sports personalities of india,sports personalities,sports personalities of india

బ్యాంకాక్‌ వేదికగా జ‌రుగుతున్న ఆసియాక‌ప్ టేబుల్ టెన్నిస్ ఈవెంట్‌లో ప‌త‌కం సాధించిన తొలి భారతీయ మహిళా క్రీడాకారిణి మ‌నికా బ‌త్రా చరిత్ర సృష్టించింది. శ‌నివారం జ‌రిగిన కాంస్య ప‌త‌క పోరులో ఆరో ర్యాంక‌ర్‌, మూడు సార్లు ఆసియా క‌ప్ ఛాంపియ‌న్ అయిన జ‌పాన్ క్రీడాకారిణి హినా హ‌య‌త్‌పై సంచలన విజయం సాధించింది. బత్రా 11-6, 6-11, 11-7, 12-10, 4-11, 11-2తో హీనా హయతాపై గెలిచి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ క్రమంలో క్వార్ట‌ర్ ఫైన‌ల్లో చైనీస్ తైపీ క్రీడాకారిణిని చెన్ జూ యుని ఓడించి, మ‌నికా సెమీ ఫైన‌ల్‌కి చేరింది. తద్వారా ఆసియాక‌ప్ సెమీ ఫైన‌ల్లో అడుగుపెట్టిన తొలి భార‌త క్రీడాకారిణిగా ఆమె గుర్తింపు సాధించింది.

అయితే, దురదృష్టవశాత్తూ సెమీఫైనల్ మ్యాచ్‌లో 2-4 (8-11, 11-7, 7-11, 6-11, 11-8, 7-11) తేడాతో మిమా ఇటో చేతిలో ఆమె ఓడిపోయింది. కానీ ఆ మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికీ కాంస్య పతక పోరులో బత్రా విజయం సాధించింది. కాగా మ‌నికా బ‌త్రా 2018 కామ‌న్‌వెల్త్ గేమ్స్‌లో రెండు బంగారు ప‌త‌కాలు సాధించిన విషయం తెలిసిందే. అలాగే ఈ టోర్న‌మెంట్‌లో మొత్తం నాలుగు మెడ‌ల్స్ కైవసం చేసుకుంది. ఇక మనికా సాధించిన ఈ విజయం పట్ల దేశవ్యాప్తంగా అభిమానులు సంబరాలు చేసుకుంటుండగా, పలువురు క్రీడా ప్రముఖులు మ‌నికా బ‌త్రా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + 10 =