భారత్‌తో నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా.. పూర్తి జట్టు ఇదే

Australia Announces Squad For The Four-Match Test Series Against Team India,IND Vs AUS Man,IND Vs AUS Date,IND Vs AUS 2,Mango News,Mango News Teugu,IND Vs AUS 3,IND Vs AUS T20,IND Vs AUS Odi,IND Vs AUS 2023 T20,IND Vs AUS Highlights,Sa Vs Aus,IND Vs AUS Women,Ind Vs Sl,Ind Vs Ban,IND Vs AUS Live,IND Vs AUS Warm Up Match,IND Vs AUS Live Score,IND Vs AUS U19,IND Vs AUS 2022,IND Vs AUS 2Nd T20,IND Vs AUS Hockey,IND Vs AUS Test,Cricbuzz IND Vs AUS,Ind W Vs Aus W,India Vs Aus

వచ్చే నెలలో జరుగనున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా జట్టు భారత్‌లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. పర్యటనలో భాగంగా నాలుగు టెస్టు మ్యాచ్‌లు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ క్రమంలో టెస్టు సిరీస్‌లో పాల్గొనే జట్టును ప్రకటించింది ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు. ఆసీస్ మాజీ కెప్టెన్ జార్జ్ బెయిలీ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఈ జట్టును ఎంపిక చేసింది. ఇక ఈ సిరీస్‌కు సీనియర్ పేసర్ ప్యాట్ కమిన్స్ సారథ్యం వహించనుండగా మొత్తం 18 మందితో కూడిన కంగారూ జట్టుని ప్రకటించింది. కాగా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరడానికి రెండు జట్లకు ఈ సిరీస్‌ కీలకం కానుండటంతో ఇరు జట్లూ తమ అత్యుతమ జట్లను బరిలోకి దించనున్నాయి. అయితే భారత్ ఇంకా తన జట్టును ప్రకటించాల్సి ఉంది.

ఇక ఆస్ట్రేలియా సీనియర్ స్పిన్నర్ నాథన్ లయన్‌తో పాటు టాడ్ మర్ఫీ, మిచెల్ స్వెప్ సన్, ఆష్టన్ అగర్‌ లను జట్టులోకి ఎంపిక చేసింది. దీంతో మొత్తం నలుగురు స్పిన్నర్లను సెలెక్ట్ చేసినట్లైంది. భారత్‌లో పిచ్‌లు సహజంగా స్పిన్ బౌలింగ్ కు అనుకూలించే నేపథ్యంలో ఆస్ట్రేలియా వీరిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అలాగే 2019 జనవరి తర్వాత, దాదాపు మూడేళ్ళ అనంతరం బ్యాటర్ పీటర్ హ్యాండ్స్‌కాంబ్‌ను జట్టులోకి తీసుకుంది. అతడితో పాటుగా మార్కస్ హ్యాన్రిస్ ను కూడా సెలెక్ట్ చేయగా.. మరో బ్యాటర్ మ్యాట్ రెన్షా రిజర్వ్ బ్యాటర్ల జాబితాలో ఉన్నాడు. డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, కామెరూన్ గ్రీన్ సహా పలువురు సీనియర్లతో కూడిన ఆసీస్ జట్టు బలంగా కనిపిస్తోంది.

భారత పర్యటన కోసం ఎంపిక చేసిన ఆస్ట్రేలియా జట్టు..

ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), ఆష్టన్ అగర్, స్కాట్ బోలాండ్, అలెక్స్ కేరీ, కామెరూన్ గ్రీన్, పీటర్ హ్యాండ్స్ కంబ్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లయన్, లాన్స్ మోరిస్, టాడ్ మర్ఫీ, మ్యాథ్యూ రెన్షా, స్టీవ్ స్మిత్(వైస్ కెప్టెన్), మిచెల్ స్టార్క్, మిచెల్ స్వెప్‌సన్, డేవిడ్ వార్నర్.

టెస్ట్ సిరీస్ షెడ్యూల్

  • 1వ టెస్ట్: 9-13 ఫిబ్రవరి 2023 (వీసీఏ స్టేడియం, నాగ్‌పూర్)
  • 2వ టెస్టు: 17-21 ఫిబ్రవరి 2023 (అరుణ్ జైట్లీ స్టేడియం, ఢిల్లీ)
  • 3వ టెస్ట్: 1-5 మార్చి 2023 (హెచ్పీసీఏ స్టేడియం, ధర్మశాల)
  • 4వ టెస్టు: 9-13 మార్చి 2023 (నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్)

వన్డే సిరీస్ షెడ్యూల్

1వ వన్డే: 17 మార్చి, 2023 (వాంఖడే స్టేడియం, ముంబై)
2వ వన్డే: 19 మార్చి 2023 (డా. వైఎస్ రాజశేఖర రెడ్డి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, విశాఖపట్నం)
3వ వన్డే: 22 మార్చి 2023 (చిదంబరం స్టేడియం, చెన్నై)

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 11 =