వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రతిపక్ష సమాజ్‌వాది పార్టీ (ఎస్పీ) తమ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈ మేరకు నిన్న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పార్టీ సీనియర్ నేతల సమక్షంలో లక్నోలో పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మేనిఫెస్టోను విడుదల చేశారు.
‘సత్తాయిస్ కా సంకల్ప్: పీడీఏ కా ప్రాణ్ పత్ర్- జన్ మన్ కా మేనిఫెస్టో- 2027’ పేరుతో రూపొందించిన ఈ హామీల పత్రంలో ఉద్యోగ కల్పన, సామాజిక సంక్షేమం, ఆర్థిక భద్రతకు పెద్దపీట వేశారు. రూపొందించినట్టు తెలుస్తోంది.
ముఖ్యంగా రైతులు, యువత, విద్యార్థులు, ఓబీసీలు, దళిత గిరిజనులు, మైనారిటీలు, మహిళలను ఆకట్టుకునే అంశాలతో దీనిని రూపొందించినట్టు తెలుస్తోంది. త్వరలోనే మహిళల సంక్షేమంపై ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేస్తామని, అలాగే జిల్లాలవారీగా కూడా మేనిఫెస్టోలు ప్రకటిస్తామని ఆయన తెలిపారు.
గతంలో మంచి రోజులు (అచ్చే దిన్) వస్తాయని బీజేపీ ప్రజలను మోసం చేసిందని, కానీ అవి రాలేదని అఖిలేశ్ యాదవ్ విమర్శించారు. అందుకే బీజేపీని గద్దె దించే లక్ష్యంతో రాజ్యాంగ దినోత్సవం రోజున సమావేశమై మేనిఫెస్టోను విడుదల చేసినట్లు వివరించారు.
-
నిరుద్యోగ భృతి: నిరుద్యోగులందరికీ ప్రతినెలా రూ.5,000 ఆర్థిక సహాయం అందిస్తామని హామీ.
-
ప్రభుత్వ ఉద్యోగాలు: ఆరేళ్ల కాలంలో 25 లక్షల మంది యువతీయువకులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటన.
-
ఉపాధి కల్పన: ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు మొత్తం 2 నుంచి 3 కోట్ల మందికి ఉపాధి అవకాశాలు సృష్టిస్తామని వాగ్దానం.
-
మహిళలకు వార్షిక పెన్షన్: వయసు పైబడిన మహిళలకు ఏటా రూ.40,000 పెన్షన్ అందిస్తామని భరోసా.
-
రూ.5కే భోజనం: రాష్ట్రవ్యాప్తంగా సమాజ్‌వాది క్యాంటీన్లను ఏర్పాటు చేసి రూ.5కే భోజనం అందజేస్తామని హామీ.
-
కులగణన: ఉత్తరప్రదేశ్‌లో కులగణన నిర్వహిస్తామని స్పష్టీకరణ.
-
విడుదల సందర్బం మరియు ఉద్దేశం: రాజ్యాంగ దినోత్సవం రోజున మేనిఫెస్టోను విడుదల చేస్తూ, ‘అచ్చే దిన్’ రాలేదంటూ బీజేపీపై విమర్శలు గుప్పించిన ఎస్పీ.
ఇక ఇదిలావుంటే, మరోవైపు లఖ్‌నవ్‌లో జరిగిన సామాజిక్ పరివర్తన్ మోర్చా కూటమి సభలో ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మీసం ఉన్నవారే అవుతారని, గడ్డం, మీసాలు లేనివారు, తలపై జుట్టు లేనివారు సీఎం అయ్యే అవకాశం లేదని పేర్కొన్నారు. దీని ద్వారా సీఎం యోగి ఆదిత్యనాథ్, అఖిలేశ్ యాదవ్‌లపై పరోక్షంగా వ్యాఖ్యలు చేస్తూ, తమ కూటమి నేత చంద్రశేఖర్ ఆజాద్ ముఖ్యమంత్రి అవుతారని ఒవైసీ జోస్యం చెప్పారు.








































