ఆస్ట్రేలియాతో 5 టీ20ల సిరీస్ కు భారత్ మహిళల జట్టును ప్రకటించిన బీసీసీఐ

BCCI Announces Indian Senior Women Squad for 5-match T20 Series Against Australia,BCCI Senior Women Squad,BCCI 5-match T20 Series,T20 Series Australia,Australia Women T20 Series,Mango News,Mango News Telugu,3 Member Cricket Advisory Committee,BCCI Advisory Committee,Advisory Committee BCCI,BCCI,BCCI Latest News and Updates,BCCI Latest News and Live Updates,The Board of Control for Cricket in India

ఆస్ట్రేలియాలో జరగనున్న 5 టీ20 మ్యాచ్ ల సిరీస్ కు భారత్ మహిళల జట్టును శుక్రవారం భారత్ క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించింది. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య డిసెంబర్ 9, 11, 14, 17, 20 తేదీల్లో 5 టీ20 మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో 15 మందితో కూడిన భారత్ మహిళల జట్టును ఆల్-ఇండియా ఉమెన్స్ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసినట్టు బీసీసీఐ తెలిపింది. హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్ గా, స్మృతి మంధాన వైస్‌ కెప్టెన్‌ గా వ్యవహరించనున్నారు. ఈ జట్టులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన యువక్రీడాకారిణి అంజలి సర్వాణి కూడా చోటు దక్కించుకుంది. అలాగే గాయం కారణంగా పూజా వస్త్రాకర్ తొలగించబడిందని మరియు ఆమెను ఎంపిక కోసం పరిగణించలేదని పేర్కొన్నారు.

ఆస్ట్రేలియాతో జరిగే టీ20 సిరీస్‌కి భారత్ మహిళల జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, యాస్తికా భాటియా (వికెట్ కీపర్), జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రాధా యాదవ్, రాజేశ్వరి గయాక్వాడ్, రేణుకా సింగ్ ఠాకూర్, మేఘనా సింగ్, అంజలి సర్వాణి, దేవిక వైద్య, ఎస్ మేఘన, రిచా ఘోష్ (వికెట్ కీపర్), హర్లీన్ డియోల్.

నెట్ బౌలర్లు – మోనికా పటేల్, అరుంధతి రెడ్డి, ఏస్బి పోకర్కర్, సిమ్రాన్ బహదూర్.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + 3 =