సౌత్ ఆఫ్రికాతో 3 వన్డేల సిరీస్ కు భారత్ జట్టు ప్రకటన, కెప్టెన్ గా శిఖర్ ధావన్

BCCI Announces India's Squad for ODI Series Against South Africa Shikhar Dhawan Named as Captain, India Team 3 ODI Series Against South Africa, Shikhar Dhawan As Captain, Ruturaj Gaikwad, Shubman Gill, Shreyas Iyer (vice-captain), Rajat Patidar, Rahul Tripathi, Ishan Kishan (wicket-keeper), Sanju Samson (wicket-keeper), Shahbaz Ahmed, Shardul Thakur, Kuldeep Yadav, Ravi Bishnoi, Mukesh Kumar, Avesh Khan, Mohd. Siraj, Deepak Chahar, IND Vs SA, India vs South Africa, Ind vs SA Cricket Latest News And Updates

భారత్, సౌత్ ఆఫ్రికా జట్ల​ మధ్య అక్టోబర్ 6, 9, 11వ తేదీల్లో మూడు వన్డేల సిరీస్ జరగనుంది. ఈ నేపథ్యంలో స్వదేశంలో జరిగే ఈ మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ కోసం ఆల్ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ భారత్ జట్టును ఎంపిక చేసినట్టు బీసీసీఐ ఆదివారం నాడు ప్రకటించింది. ఈ వన్డే సిరీస్ కు కెప్టెన్ గా శిఖర్ ధావన్ ను, వైస్ కెప్టెన్ గా శ్రేయాస్ అయ్యర్ వ్యవహరించనున్నట్టు బీసీసీఐ తెలిపింది. సౌత్ ఆఫ్రికాతో ప్రస్తుతం జరుగుతున్న టీ20 సిరీస్ అనంతరం రెగ్యులర్ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ నేతృత్వంలోని టీ20 జట్టు, సన్నాహక శిబిరంలో భాగంగా టీ20 ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియాకు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్ కోసం శిఖర్ ధావన్ నేతృత్వంలో యువకులతో కూడిన జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది.

భారత్ టీ20 ప్రపంచ కప్ లో స్టాండ్ బై ప్లేయర్స్ గా ఉన్న శ్రేయాస్, రవి బిష్ణోయ్ మరియు దీపక్ చాహర్‌లను తప్ప, ప్రపంచ కప్ జట్టుకు ఎంపిక చేయబడ్డ ఇతర ఆటగాళ్లు ఎవరూ సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్‌ లో భాగం కావడం లేదు. ఇక దేశవాళీ క్రికెట్ లో నిలకడగా రాణిస్తున్న బ్యాటర్ రజత్ పాటిదార్ మరియు ఫాస్ట్ బౌలర్ ముఖేష్ కుమార్ లు తొలిసారిగా సౌత్ ఆఫ్రికాతో జరిగే వన్డే కోసం భారత్ జట్టులో చోటుదక్కించుకున్నారు.

సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్ కోసం భారత్ జట్టు: శిఖర్ ధావన్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), రజత్ పాటిదార్, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, శార్దుల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్, మహమ్మద్ సిరాజ్, దీపక్ చాహర్.

షెడ్యూల్:

  • అక్టోబర్ 6 – తోలి వన్డే – లక్నో
  • అక్టోబర్ 9 – రెండవ వన్డే – రాంచీ
  • అక్టోబర్ 11 – మూడవ వన్డే – న్యూఢిల్లీ.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + twenty =