మధ్యాహ్నం 1.19 గంటలకు మూహూర్తం, దసరారోజున జాతీయ పార్టీని ప్రకటించనున్న సీఎం కేసీఆర్‌?

Telangana CM KCR Likely To Announce National Party on Dussehra October 5th at 119 pm, KCR To Announce National Party, National Party on Dussehra, KCR National Party, Mango News, Mango News Telugu, KCR Eyes Electoral Pie Beyond Telangana, Telangana CM KCR, Telangana CM KCR Latest News And Updates, Telangana CM KCR May Launch National Party, Telangana CM KCR National Politics, CM KCR National Politics, CM KCR National Politics 2024, National Politics News And Live Updates

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జాతీయ పార్టీని స్థాపించనున్నట్లు ఇదివరకే ప్రకటించడం తెలిసిందే. ఈ క్రమంలో ముఖ్యమంత్రి స్థాపించనున్న జాతీయ పార్టీ ప్రకటనకు ముహూర్తం కుదిరింది. అక్టోబర్ 5, దసరా పండుగ రోజున మధ్యాహ్నం 1.19 గంటలకు ఆయన జాతీయ పార్టీ పేరుని ప్రకటించనున్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నం రాష్ట్ర మంత్రులు, పార్టీ కీలక నేతలు, 33 జిల్లాల టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులతో జరిపిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దాదాపు మూడు గంటలపాటు సాగిన ఈ సమావేశంలో జాతీయ పార్టీ ఏర్పాటు ఆవశ్యకత, పార్టీ జెండా, అజెండాలపై ప్రధానంగా చర్చించారు.

దీనికోసం ఇప్పటికే పలు పేర్లను పరిశీలించిన ఆయన ‘బీఆర్ఎస్’ పేరుకే మొగ్గు చూపినట్లు సమాచారం. అయితే పార్టీ పేరు మాత్రమే మారుతుందని, గుర్తు మాత్రం ‘కారు’ ఉంటుందని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు 5వ తేదీ ఉదయం 11 గంటలకు నిర్వహించనున్న పార్టీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశంలో మొత్తం 283 మంది సభ్యులు జాతీయ పార్టీ ఏర్పాటుని ఆమోదిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేయనున్నారు. అనంతరం పార్టీ పేరుని అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో డిసెంబర్ 9న ఢిల్లీలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అయితే దీనికి ముందు డిసెంబర్ 6న కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ కోసం టీఆర్ఎస్‌ ప్రతినిధులు కొందరు ఢిల్లీకి వెళ్లనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 2 =