కేంద్రం కీలక నిర్ణయం.. నాగాలాండ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌లలో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం మరో ఆరు నెలలు పొడిగింపు

Centre Extends AFSPA In Parts Of Nagaland And Arunachal Pradesh States For Next 6 Months From April 1St,Centre Extends AFSPA In Parts,Nagaland And Arunachal Pradesh States,Centre Extends AFSPA In Parts For Next 6 Months,AFSPA In Parts From April 1St,Mango News,Mango News Telugu,Centre Extends AFSPA In Parts Of Nagaland,Centre Extends Disturbed Area Status Under AFSPA,Government Of India Extends AFSPA,Centre Extends AFSPA In Arunachal Pradesh,Mha Extends AFSPA In Parts,Arunachal Pradesh Latest News,Nagaland Latest Updates

కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. నాగాలాండ్ మరియు అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలో సాయుధ దళాల (ప్రత్యేక అధికారాలు) చట్టాన్ని మరో 6 నెలల పాటు పొడిగించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. 1958లోని సెక్షన్ 3 ద్వారా అందించబడిన అధికారాలను ఉపయోగించి కేంద్ర ప్రభుత్వం అరుణాచల్ ప్రదేశ్‌లోని చాంగ్లాంగ్, తిరప్ మరియు లాంగ్డింగ్‌ జిల్లాలతోపాటు అసోం సరిహద్దుల్లోని నామ్‌సాయ్‌ జిల్లా నామ్‌సాయ్‌, మహదేవ్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో ఈ చట్టం అమల్లో ఉంటుంది. అలాగే దిమాపూర్‌, నియులాండ్‌, చౌమౌకెడిమా, మోన్‌, కిఫైర్‌, నోక్లాక్‌, ఫెక్‌, పెరెన్‌ జిల్లాల్లోని ప్రాంతాల్లోనూ ఇది వర్తిస్తుంది. కాగా 2022, సెప్టెంబర్‌ 30న ఏఫ్‌ఎస్‌పీఏ అమలు కాలాన్ని కేంద్రం ఆరు నెలల పాటు పొడిగించింది.

ఈ నేపథ్యంలో మార్చి నెలాఖరుతో ఆ గడువు ముస్తుండటంతో తాజాగా మరోసారి పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఈ రెండు రాష్ట్రాల్లో శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించిన తర్వాత హోం మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం.. వారెంట్ లేకుండానే ఒక వ్యక్తిని అరెస్టు చేయడానికి, ఇల్లు లేదా కార్యాలయంలోకి ప్రవేశించడానికి మరియు శోధించడానికి, అలాగే ఇతర చర్యలను నిర్వహించడానికి భద్రతా దళాలకు అధికారం ఉంటుంది. దేశంలోని సమస్యాత్మక ప్రాంతాలు మరియు ఘర్షణలు చోటుచేసుకునే ప్రాంతాల్లో శాంతి భద్రతలను నిర్వహించడానికి సాయుధ బలగాలకు ఈ చట్టం ప్రత్యేక అధికారాలను ఇస్తుంది. ప్రస్తుతం జమ్ముకశ్మీర్‌తో పాటు, అసోం, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్‌ రాష్ట్రాలోని కొన్ని ప్రాంతాలలో కేంద్రం దీనిని అమలుచేస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + 4 =