ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం కర్ణాటక రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా శనివారం మధ్యాహ్నం బెంగుళూరు మెట్రో యొక్క వైట్ ఫీల్డ్ (కడుగోడి) నుండి కృష్ణరాజపుర మెట్రో లైన్ ను ప్రధాని మోదీ ప్రారంభించారు. అనంతరం కొత్తగా ప్రారంభించిన మెట్రోలో ప్రధాని మోదీ ప్రయాణిస్తూ విద్యార్థులు, మెట్రో కార్మికులు సహా వివిధ వర్గాల ప్రజలతో సంభాషించారు.
వైట్‌ఫీల్డ్ (కడుగోడి) మెట్రో స్టేషన్‌కు చేరుకున్న ప్రధాని మోదీ, ముందుగా టికెట్ కౌంటర్‌లో టిక్కెట్ ను కొనుగోలు చేసి, ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను వీక్షించారు. అనంతరం వైట్ ఫీల్డ్ మెట్రో లైన్ ప్రారంభోత్సవానికి గుర్తుగా ఫలకాన్ని ఆవిష్కరించిన ప్రధాని, మెట్రో ఎక్కేందుకు ప్లాట్‌ఫారమ్ వైపు వెళ్లారు. మెట్రోలో తన ప్రయాణంలో బెంగళూరు మెట్రో కార్మికులు సిబ్బందితో ముచ్చటించారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీతో పాటు కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ మరియు కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై ఉన్నారు.
దేశ వ్యాప్తంగా ప్రపంచ స్థాయి అర్బన్ మొబిలిటీ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి సారించారు. దీనికి అనుగుణంగా, బెంగళూరు మెట్రో ఫేజ్ 2 కింద వైట్‌ఫీల్డ్ (కడుగోడి) మెట్రో నుంచి కృష్ణరాజపుర మెట్రో లైన్ ఆఫ్ రీచ్-1 ఎక్స్‌టెన్షన్ ప్రాజెక్ట్ వరకు 13.71 కి.మీ.ని వైట్‌ఫీల్డ్ (కడుగోడి) మెట్రో స్టేషన్‌లో ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు. సుమారు రూ.4250 కోట్లతో నిర్మించబడిన ఈ మెట్రో లైన్ ప్రారంభోత్సవం బెంగళూరులోని ప్రయాణికులకు పరిశుభ్రమైన, సురక్షితమైన, వేగవంతమైన మరియు సౌకర్యవంతమైన ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తుందని, ప్రయాణ సౌలభ్యాన్ని మెరుగుపరుస్తుందని మరియు నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తుందని పేర్కొన్నారు. మరోవైపు శనివారం ఉదయం చిక్క బళ్లాపూర్‌లో శ్రీ మధుసూదన్ సాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్‌ని కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE