ఆ డాక్యుమెంట‌రీ లింకులను బ్లాక్ చేయండి, సోషల్ నెట్ వర్కింగ్ సైట్లకు కేంద్రం ఆదేశాలు..!

Centre Orders Two Social Media Giants To Take Down Links Regarding The Alleged Documentary,Centre Orders Two Social Media Giants,Take Down Links,Regarding The Alleged Documentary,Mango News,Mango News Telugu,Centre Orders Youtube,Centre Orders Twitter,Centre Orders Take Down Links Of Bbc,National Politics News,National Politics And International Politics,National Politics Article,National Politics In India,National Politics News Today,National Post Politics,Nationalism In Politics,Post-National Politics,Indian Politics News,Indian Government And Politics,Indian Political System,Indian Politics 2023,Recent Developments In Indian Politics,Shri Narendra Modi Politics,Narendra Modi Political Views,President Of India,Indian Prime Minister Election

మీడియా దిగ్గజం బీబీసీ రూపొందించిన ఒక ప్రత్యేక డాక్యుమెంటరీకి సంబంధించి కేంద్రప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఆ డాక్యూమెంటరీకి సంబంధించిన లింకులను బ్లాక్ చేయాలని కొన్ని ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ సైట్లకు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే.. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ ఒకటి వివాదాస్పదమయింది. 2002లో గుజరాత్ రాష్ట్రంలో చోటుచేసుకున్న అల్లర్లకు సంబంధించి బీబీసీ డాక్యుమెంటరీ తీసింది. అయితే దీనిపై కేంద్రం తీవ్రంగా స్పందించింది. ఆ డాక్యూమెంటరీని విద్వేషపూరిత చర్యగా పేర్కొన్న కేంద్రం ఆ లింక్‌లను తీసివేయాలని ట్విట్టర్ మరియు యూట్యూబ్‌లను ఆదేశించింది. దీంతో ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’ అనే డాక్యుమెంటరీకి సంబంధించిన ట్వీట్లు మరియు యూట్యూబ్ వీడియోలు ఇకపై మైక్రోబ్లాగింగ్ మరియు వీడియో-షేరింగ్ వెబ్‌సైట్‌లలో కనిపించవు. కాగా ఇదే డాక్యూమెంటరీకి సంబంధించి పాకిస్తాన్ మూలాలున్న ఎంపీ ఒకరు బ్రిటన్ పార్లమెంటులో ప్రశ్నించగా.. యూకే ప్రధాని రిషి సునాక్ ఆధారరహితమని కొట్టిపారేసిన విషయం తెలిసిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 3 =