13 భాషల్లో అందుబాటులోకి వచ్చిన ప్రధాని మోదీ రాసిన ‘ఎగ్జామ్ వారియర్స్’ బుక్

Exam Warriors Book by PM Narendra Modi is Now Available in 13 Languages,Exam Warriors Book,Exam Warriors by PM Narendra Modi,Exam Warriors Available in 13 Languages,Mango News,Mango News Telugu,Exam Warriors New Edition,Exam Warriors App,Exam Warriors Book Written By,Exam Warriors Paragraph,Exam Warriors Book In Hindi,Exam Warriors In Hindi,Exam Warriors Book Review,Exam Warriors Book By Narendra Modi In Hindi Pdf,Exam Warriors Book Summary,Exam Warriors Book By Narendra Modi,Exam Warriors Book In Telugu Pdf,Exam Warriors Book In Kannada Pdf,Exam Warriors Book Buy

పరీక్షల సమయంలో ఒత్తిడిని ఎదుర్కోవటానికి విద్యార్థులకు సహాయపడే దిశగా, అనుసరించవలసిన విధానాలను గురించి వివరిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘ఎగ్జామ్ వారియర్స్’ అనే బుక్ ను రచించిన విషయం తెలిసిందే. ఎగ్జామ్ వారియర్స్ బుక్ ముందుగా 2018లో ప్రచురించబడింది. విద్యార్థులు మరియు తల్లిదండ్రుల కోసం కొత్త మంత్రాలతో ప్రధాని రచించిన ఎగ్జామ్ వారియర్స్ బుక్ యొక్క అప్ డేటెడ్ ఎడిషన్ ఇప్పుడు 13 బారతీయ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. ఎగ్జామ్ వారియర్స్ బుక్ ప్రస్తుతం హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, ఒడియా, అస్సామీ, గుజరాతీ, మరాఠీ, పంజాబీ, ఉర్దూ, ఇంగ్లీష్ మరియు బెంగాలీ భాషల్లో లభిస్తుంది. “ఎగ్జామ్ వారియర్స్ బుక్ ఇప్పుడు 13 భాషల్లో అందుబాటులో ఉన్నందుకు ఆనందంగా ఉంది. అందరికీ పఠన శుభాకాంక్షలు” అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి ఏడాది విద్యార్థులతో ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది పరీక్షా పే చర్చ కార్యక్రమం జనవరి 27వ తేదీన జరగనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులతో సంభాషించనున్నారు. విద్యార్థులు ఒత్తిడి లేకుండా పరీక్షల రాసే అంశంపై ప్రధాని మోదీ కీలక సూచనలు చేయనున్నారు. ఈ క్రమంలో పరీక్షా పే చర్చ కార్యక్రమంకు ముందుగా దేశవ్యాప్తంగా పలు పాఠశాలల్లో ఎగ్జామ్ వారియర్స్ బుక్ ను పార్టీ నేతలు పంపిణీ చేస్తున్నారు. ఇటీవలే పలు రాష్ట్రాల గవర్నర్లు ఎగ్జామ్ వారియర్స్ బుక్ ను ఆవిష్కరించి, విద్యార్థులకు అందజేశారు. ఇక శనివారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ లో రౌండ్ టేబుల్ స్కూల్‌ లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు ఎగ్జామ్ వారియర్స్ బుక్స్ అందించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ఈ బుక్ లో విద్యార్థులు పరీక్ష ఒత్తిడి నుండి ఉపశమనం పొందేందుకు సహాయపడే దృష్టాంతాలు, ఎక్సర్ సైజ్స్ మరియు కార్యకలాపాలు ఉన్నాయని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + 17 =