కామన్వెల్త్ గేమ్స్ 2022: సత్తా చాటిన భారత మహిళల జట్లు.. క్రికెట్ జట్టుకి రజతం, హాకీ జట్టుకి కాంస్య పతకాలు

Commonwealth Games 2022 Indian Women's Cricket Team Wins Silver and Hockey Team Gets Bronze Medals, Indian Women's Cricket Team Wins Silver and Hockey Team Gets Bronze Medals, Indian Hockey Team Gets Bronze Medal, Indian Women's Cricket Team Wins Silver Medal, Bronze Medal And Silver Medal, CWG-2022, Commonwealth Games-2022, Birmingham Commonwealth Games 2022, 2022 Birmingham Commonwealth Games, Birmingham Commonwealth Games, Commonwealth Games, Birmingham Alexander Stadium, Commonwealth Games 2022 sports, Birmingham Commonwealth Games 2022 News, Birmingham Commonwealth Games 2022 Latest News, Birmingham Commonwealth Games 2022 Latest Updates, Birmingham Commonwealth Games 2022 Live Updates, Mango News, Mango News Telugu,

ఇంగ్లాండ్ బర్మింగ్‌హామ్‌ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ లో భారత మహిళల జట్లు సత్తా చాటాయి. క్రికెట్ జట్టు రజత పతకం సాధించగా, హాకీ జట్టు కాంస్య పతకం దక్కించుకుంది. కాగా కామన్వెల్త్‌ క్రీడల్లో తొలిసారి పతక క్రీడగా ప్రవేశపెట్టిన మహిళల క్రికెట్‌లో భారత్ తృటిలో స్వర్ణం చేజార్చుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో టీమిండియా ఆస్ట్రేలియాకు గట్టి పోటీ ఇచ్చినా చివరకు 9 పరుగుల తేడాతో పరాజయం పాలై రజతం దక్కించుకున్నారు. ఇక మ్యాచ్‌లో భారత కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌కౌర్‌ అత్యధికంగా 65 పరుగులు చేయగా, జెమీమా రోడ్రిగ్స్‌ 33 పరుగులు చేసింది. అయితే వరుస ఓవర్లలో వీరిరువురూ ఔటవడంతో భారత్ చివర్లో ఒత్తిడి జయించలేక ఓటమి పాలయ్యారు.

ఇక మరోవైపు భారత మహిళల హాకీ జట్టు కామన్వెల్త్‌ క్రీడల్లో కాంస్య పతకం సాధించింది. మ్యాచ్ మరికొద్దిసేపట్లో ముగుస్తుందనగా చివరి క్షణాల్లో చేసిన చిన్న పొరపాటు వలన షూటౌట్‌కు దారి తీయగా, కెప్టెన్‌ సవిత ఒత్తిడిని అధిగమిస్తూ ‘షూటౌట్‌’లో 2–1తో న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించింది. దీంతో మూడో స్థానంలో నిలిచిన భారత్‌కు కాంస్య పతకం లభించింది. తద్వారా 16 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ భారత మహిళల హాకీ జట్టు కామన్వెల్త్‌ గేమ్స్‌లో పతకం సాధించింది. ఇక కామన్వెల్త్‌ గేమ్స్‌ మహిళల హాకీలో భారత్‌కిది మూడో పతకం కాగా, 2002 గేమ్స్‌లో స్వర్ణం నెగ్గిన జట్టు మళ్ళీ 2006లో రజతం సాధించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × five =