సెప్టెంబర్ 7 నుంచి కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర ప్రారంభం, లోగో, ట్యాగ్‌లైన్ విడుదల

Congress Launches Logo and Tagline of Bharat Jodo Yatra which Starts From September 7th, Congress Launches Tagline of Bharat Jodo Yatra which Starts From September 7th, Congress Launches Logo of Bharat Jodo Yatra which Starts From September 7th, Bharat Jodo Yatra which Starts From September 7th, Logo and Tagline of Bharat Jodo Yatra, Bharat Jodo Yatra, Logo and Tagline, Bharat Jodo Yatra News, Bharat Jodo Yatra Latest News And Updates, Bharat Jodo Yatra Live Updates, Mango News, Mango News Telugu,

కాంగ్రెస్ పార్టీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్రను సెప్టెంబర్ 7, 2022 నుండి ప్రారంభించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో భారత్ జోడో యాత్రకు కాంగ్రెస్ పార్టీ అన్ని ఏర్పాట్లను సిద్ధం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఢిల్లీలో భారత్ జోడో యాత్రకు సంబంధించిన లోగో, ట్యాగ్‌లైన్, వెబ్ సైట్ ను ఆ పార్టీ సీనియర్ నేతలు జైరాం రమేష్, దిగ్విజయ్ సింగ్ సంయుక్తంగా ఆవిష్కరించారు. ఈ యాత్రకు ‘మిలే కదమ్-జూడ్ వతన్’ అనే ట్యాగ్‌లైన్ పెట్టారు. దేశాన్ని ఏకం చేయడమే యాత్ర లక్ష్యం అని, అంతా కలిసి రావాలి మరియు దేశాన్ని తిరిగి దాని కాళ్ళపైకి తీసుకురావాలని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా జైరాం రమేష్, దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ, సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి ప్రారంభమయ్యే ఈ పాదయాత్ర 12 రాష్ట్రాలు మరియు 2 కేంద్రపాలిత ప్రాంతాల గుండా వెళ్లి జమ్మూ అండ్ కాశ్మీర్‌లో ముగియనుందని చెప్పారు. దాదాపు 148 రోజుల వ్యవధిలో రోజుకి 25 కిలోమీటర్ల చొప్పున దాదాపు 3,500 కిలోమీటర్ల దూరం ఈ పాదయాత్ర సాగనుంది. ఈ యాత్రలో రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ సీనియర్ నేతలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారు. ఈ యాత్రలో పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాతో సహా సీనియర్ కాంగ్రెస్ నేతలు హాజరయ్యే పాదయాత్రలు, ర్యాలీలు మరియు బహిరంగ సభలు ఉంటాయని చెప్పారు. భారత్ జోడో యాత్రకు సంబంధించిన వెబ్ సైట్ కూడా ప్రారంభిస్తున్నామని జైరాం రమేష్ తెలిపారు.

ఈ యాత్రలో భౌతికంగా పాల్గొనలేని వారు ఈవెంట్‌లను నిర్వహించడం మరియు ఆన్‌లైన్ ప్రచారాలలో పాల్గొనడం ద్వారా యాత్ర సందేశాన్ని వ్యాప్తి చేస్తారని అన్నారు. ముందుగా కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్ర ప్రకటన చేస్తూ, భయం, మతోన్మాదం, ఆర్ధిక జీవనోపాధి విధ్వంసం, పెరుగుతున్న నిరుద్యోగం, పెరుగుతున్న అసమానతలు మరియు పక్షపాత రాజకీయాలకు ప్రత్యామ్నాయాన్ని అందించడానికి ఒక భారీ జాతీయ ప్రయత్నంలో భాగం కావాలని కోరుకునే వారందరూ భారత్ జోడో యాత్రలో పాల్గొనాలని విజ్ఞప్తి చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + 5 =