గేట్-2023: ఆగస్టు 30న రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం, పరీక్ష తేదీలు ఎప్పుడంటే?

GATE 2023 Registration Process to Begin from August 30 Details of Important Dates, Details of Important Dates, GATE 2023 Registration Process to Begin from August 30, GATE 2023 Registration Process, Graduate Aptitude Test in Engineering, Registration Process, 2023 GATE, GATE 2023, GATE, GATE 2023 News, GATE 2023 Latest News And Updates, GATE 2023 Live Updates, Mango News, Mango News Telugu,

గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్)-2023 నోటిఫికేషన్ జూలై 29న విడుదలైన విషయం తెలిసిందే. గేట్-2023 అనేది కంప్యూటర్ ఆధారిత పరీక్ష కాగా, దీనిని ఈ ఏడాది ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ నిర్వహిస్తోంది. ఇంజనీరింగ్/టెక్నాలజీ/ఆర్కిటెక్చర్/సైన్స్/కామర్స్/ఆర్ట్స్‌లో మాస్టర్స్ ప్రోగ్రామ్స్ మరియు డైరెక్ట్ డాక్టరల్ ప్రోగ్రామ్స్ లో మరియు కేంద్ర విద్యాశాఖ, ఇతర ప్రభుత్వ ఏజెన్సీలు మద్దతు ఇచ్చే సంస్థలలో ఆర్ట్స్ మరియు సైన్స్ సంబంధిత శాఖలలో డాక్టరల్ ప్రోగ్రామ్స్ లో ప్రవేశాలు/ఆర్థిక సహాయం కోసం గేట్ పరీక్షను నిర్వహిస్తారు. గేట్ స్కోర్‌ను కొన్ని కాలేజీలు, సంస్థలు కేంద్ర విద్యాశాఖ స్కాలర్‌షిప్/అసిస్టెంట్‌షిప్ లేకుండా విద్యార్థులకు ప్రవేశం కల్పించడానికి కూడా ఉపయోగిస్తాయి. అలాగే అనేక ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్యూలు) తమ రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో గేట్ స్కోర్‌ను ఉపయోగిస్తున్నాయి.

ఇక గేట్-2023 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగస్టు 30, మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. గేట్-2023 కు దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 30 ఆఖరి తేదీ అని ప్రకటించారు. గేట్ ఎగ్జామ్ 2023, ఫిబ్రవరి 4, 5, 11, 12 తేదీల్లో జరగనుండగా, ఫలితాలను మార్చి 16, 2023 న విడుదల చేయనున్నట్టు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

గేట్-2023 ముఖ్య తేదీలు:

  1. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం (https://gate.iitk.ac.in): ఆగస్టు 30, 2022
  2. రెగ్యులర్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్/దరఖాస్తు ప్రక్రియ ముగింపు: సెప్టెంబర్ 30, 2022
  3. పొడిగించిన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్/దరఖాస్తు ప్రక్రియ ముగింపు: అక్టోబర్ 7, 2022
  4. గేట్-2023 దరఖాస్తులో మార్పులు: నవంబర్ 4 నుండి నవంబర్ 11, 2022 వరకు
  5. గేట్ అడ్మిట్ కార్డ్‌లు డౌన్‌లోడ్ ప్రారంభం: జనవరి 03, 2023
  6. గేట్-2023 పరీక్షలు నిర్వహణ: ఫిబ్రవరి 04, 05 మరియు ఫిబ్రవరి 11, 12 2023
  7. దరఖాస్తు పోర్టల్‌లో అభ్యర్థి ప్రతిస్పందన అందుబాటు: ఫిబ్రవరి 15, 2023
  8. అప్లికేషన్ పోర్టల్‌లో ఆన్సర్ కీలు అందుబాటు: ఫిబ్రవరి 21, 2023
  9. ఆన్సర్ కీలలో అభ్యర్థులచే ఛాలెంజెస్ సమర్పణ: ఫిబ్రవరి 22, 2023 నుండి ఫిబ్రవరి 25, 2023
  10. గేట్-2023 ఫలితాల ప్రకటన: మార్చి 16, 2023
  11. స్కోర్ కార్డ్స్ డౌన్‌లోడ్ ప్రారంభం: మార్చి 21, 2023.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 2 =