ఇది బలవంతులపై బలహీనులు సాధించిన విజయం – కర్ణాటక ఫలితాలపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు

Congress Leader Rahul Gandhi Interesting Comments Over Victory in Karnataka Assembly Elections,Congress Leader Rahul Gandhi,Rahul Gandhi Interesting Comments Over Victory,Congress Victory in Karnataka Assembly Elections,Karnataka Assembly Elections,Mango News,Mango News Telugu,Karnataka election result,Congress Victory In Karnataka,Rahul Gandhi Latest News And Updates,Congress Won in Karnataka,Karnataka Election 2023

కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ పార్టీ జెట్ స్పీడ్‌తో దూసుకుపోయింది. శనివారం కౌంటింగ్ ప్రారంభమైనప్పటినుండి అన్ని రౌండ్లలో కాంగ్రెస్ తన సమీప ప్రత్యర్థి బీజేపీపై స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ కర్ణాటక ఫలితాలపై స్పందించారు. పార్టీపై నమ్మకంవుంచి అద్భుత విజయాన్ని అందించిన కర్ణాటక రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ విజయానికి కృషి చేసిన పార్టీ శ్రేణులకు అభినందనలు తెలిపారు. ఇక దీనిని బలవంతులపై బలహీనులు సాధించిన విజయంగా అభివర్ణించిన రాహుల్ గాంధీ.. శత్రుత్వ బజార్ మూతపడిందని, ప్రేమించే దుకాణం తెరుచుకుందని పేర్కొన్నారు. పేదల తరపున కాంగ్రెస్‌ పోరాడిందని, ఇది కర్ణాటక ప్రజల విజయమని అన్నారు. విద్వేష రాజకీయాలను రాష్ట్ర ప్రజలు తిప్పికొట్టారని, అలాగే రాబోయే రోజుల్లో కేంద్రం, రాష్ట్రాల్లో ఇవే ఫలితాలు పునరావృతమవుతాయని ధీమా వ్యక్తం చేశారు.

కాగా మొత్తం 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటకలో అధికారం చేపట్టాలంటే కావాల్సిన మేజిక్ మార్కును (113 సీట్లు) ఆ పార్టీ అవలీలగా అధిమించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన ఫలితాలను దాటుకుని మరీ 130కి పైగా స్థానాల్లో విజయం సాధించింది. దీంతో కాంగ్రెస్ వర్గాలు కూడా ఒకింత ఆశ్చర్యానికి గురయ్యాయి. జేడీఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో అని అనుమాన పడిన ఆ పార్టీ ఫలితాల జోరు చూశాక నిశ్చింతగా ఉంది. మరోవైపు బీజేపీ ఈ పరాభవాన్ని జీర్ణించుకోలేకపోతోంది. కాంగ్రెస్ సాధించిన స్థానాలలో సగం స్థానాలు మాత్రమే ఆ పార్టీ కైవసం చేసుకోవడం గమనార్హం. ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిట రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ ప్రచారం నిర్వహించినా ఓటమిని తప్పించుకోలేకపోయింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 4 =