తిరుమలను ప్లాస్టిక్ రహిత ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చడంలో ప్రతి భక్తుడు భాగస్వామీ కావాలి – మాజీ సీజేఐ ఎన్వీ రమణ

Former CJI NV Ramana Launches Sudha Tirumala-Sundara Tirumala A Massive Mass Cleaning Program at Alipiri Today,Former CJI NV Ramana Launches Sudha Tirumala-Sundara,Tirumala A Massive Mass Cleaning Program,Tirumala A Massive Mass Cleaning Program At Alipiri,Mango News,Mango News Telugu,Former CJI NV Ramana,Former CJI NV Ramana Latest News And Updates,Sudha Tirumala-Sundara,Sudha Tirumala-Sundara Latest News And Updates,Cleaning Program at Alipiri Today,Alipiri Latest News And Updates

తిరుమలను ప్లాస్టిక్ రహిత ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చడంలో ప్రతి భక్తుడు భాగస్వామి కావాలని, తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ. శనివారం ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో ‘శుద్ధ తిరుమల-సుందర తిరుమల’ పేరుతో చేపట్టిన సామూహిక శ్రమదానం కార్యక్రమాన్ని అలిపిరి వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. తిరుపతి-తిరుమల ఘాట్ రోడ్లు, అలిపిరి, శ్రీవారి మెట్ల నడక మార్గాల్లోని ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడం కోసం టీటీడీ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం గొప్ప విషయమని, స్వచ్ఛంద సేవతో ఇందులో పాల్గొంటున్న ఉద్యోగులు, శ్రీవారి సేవకులు, భక్తులు అందరూ పూనుకోవటం అభినందనీయమని తెలిపారు. న్యాయమూర్తులకు స్వచ్ఛందసేవకు అవకాశం కల్పించాలని 2008లో జాయింట్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్‌గా ఉన్న ధర్మారెడ్డిని తనకు ఇలాంటి సేవ చేసే అవకాశం కల్పించాలని కోరానని, ఇన్నాళ్లకు భగవంతుడు తనకు ఆ అవకాశం ఇచ్చారని పేర్కొన్నారు.

తిరుమల కొండలు ప్రకృతి అందాలకు నెలవు అని, అనేక దేవతలు సంచరించిన ఈ సప్తగిరులకు ఎంతో పవిత్రత ఉందని జస్టిస్ రమణ తెలిపారు. ఇక శ్రీవారి దర్శనార్ధం వచ్చే ప్రతి ఒక్క భక్తుడు ఈ ప్రాంతాన్ని తమ ఇంట్లో దేవుడి గదిలా భావించి శుభ్రంగా, పవిత్రంగా ఉంచేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. తమతో పాటు తీసుకువచ్చే ప్లాస్టిక్‌తో పాటు ఇతర వ్యర్ధాలను కొండపై నిర్ధేశించిన ప్రాంతాల్లోనే భక్తులు వేయాలని, తద్వారా స్వామివారు కొలువైన ఈ పుణ్యక్షేత్రం యొక్క పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు తిరుమలలో ఆహ్లాదకర వాతావరణాన్ని నెలకొల్పడం భక్తులుగా మన కర్తవ్యమని అన్నారు. అంతకుముందు టీటీడీ ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ.. తిరుమల పవిత్రతను కాపాడేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని, ఇకపై ప్రతి నెలా రెండవ శనివారం దీనిని నిర్వహిస్తామని తెలిపారు. రెండు ఘాట్ రోడ్డులు, నడకదారుల్లో శ్రమదానం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, వ్యర్థాలను నిర్దేశించిన చోటే వేసి తిరుమలని పరిశుభ్రంగా ఉంచేందుకు భక్తులు టీటీడీకి సహకరించాలని కోరారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 − 5 =