పేదలు ఆకలితో ఉన్నారు, కేంద్రం తన స్నేహితుల జేబులను నింపుతుంది: రాహుల్ గాంధీ

Congress Leader, Congress Leader Rahul Gandhi, national news, national political updates, PM Modi, rahul gandhi, Rahul Gandhi attacks Centre, Rahul Gandhi attacks Modi government, Rahul Gandhi Comments, Rahul Gandhi Comments On Modi, Rahul Gandhi Comments On Modi Government, Rahul Gandhi says Central Govt Busy in Filling Pockets

కాంగ్రెస్ నాయకుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు. అంతర్జాతీయ హంగర్(ఆకలి) ఇండెక్స్- 2020 ‌నివేదికలో పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ దేశాల కంటే భారత్ 94 వ స్థానంలో ఉండడాన్ని ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. “భారతదేశంలోని పేదలు ఆకలితో ఉన్నారు, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తన ప్రత్యేక ‘స్నేహితుల’ జేబులను నింపుతోంది” అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

107 దేశాలకు సంబంధించి అంతర్జాతీయ హంగర్(ఆకలి) ఇండెక్స్- 2020 ను తాజాగా ప్రకటించారు. ఆయా దేశాల్లో ఆకలి స్థాయిలు మరియు పోషకాహార లోపాలకు సంబంధించి వివరాలను హాంగర్ ఇండెక్స్ సూచిస్తుంది. ఇందులో భారత్‌ 94వ స్థానంలో నిలవగా, పొరుగుదేశాలైన పాకిస్థాన్‌ 88, నేపాల్‌ 73, బంగ్లాదేశ్‌ 75 స్థానాల్లో నిలిచాయి.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − 6 =