దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 3,06,064 కేసులు, 439 మరణాలు నమోదవడంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,95,43,328 కు చేరుకోగా, మరణాల సంఖ్య 4,89,848 కి పెరిగింది. కొత్తగా నమోదైన కేసుల్లో కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లోనే కేసులు అత్యధికంగా నమోదు అయ్యాయి. మరో 2,43,495 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 3,68,04,145 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 93.07 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.24 శాతంగా నమోదైంది. దేశంలో ప్రస్తుతం 22,49,335 (5.69%) యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
గత 24 గంటల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదైన 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలివే (జనవరి 23 (8am)–జనవరి 24 (8am)):
- కర్ణాటక – 50,210
- కేరళ – 45,449
- మహారాష్ట్ర – 40,805
- తమిళనాడు – 30,580
- గుజరాత్ – 16,617
- ఆంధ్రప్రదేశ్ – 14,440
- రాజస్థాన్ – 14,112
- ఉత్తర్ ప్రదేశ్ – 13,654
- మధ్యప్రదేశ్ – 11,253
- ఢిల్లీ – 9,197
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF