‘జాతీయ బాలికల దినోత్సవ’ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

2022 National Girl Child Day, empowering girl child, international girl child day, Mango News, Modi Wishes on National Girl Child Day, National Girl Child Day, National Girl Child Day 2022, national news, PM Modi extends wishes on National Girl Child Day, pm narendra modi, PM Narendra Modi Wishes on National Girl Child Day, priority to empowering girl child

కేంద్ర ప్రభుత్వం చేపట్టే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలోనూ బాలికల సాధికారతకు తగిన ప్రాధాన్యమిస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. నేడు ‘జాతీయ బాలికల దినోత్సవం’ సందర్భంగా మోదీ ట్విటర్ వేదికగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసారు. ‘జాతీయ బాలికల దినోత్సవం.. బాలికల సాధికారత కోసం కొనసాగుతున్న ప్రయత్నాలను బలోపేతం చేయడానికి ఒక సందర్భంగా భావిస్తున్నాం. అంతేకాదు, ఈ విషయంపై మా మా నిబద్ధతను చాటుకోవడానికి ఒక అవకాశంగా భావిస్తున్నాం. వివిధ రంగాల్లో అమ్మాయిలు సాధించిన స్ఫూర్తిదాయక విజయాలను వేడుకగా జరుపుకునే రోజు ఈ రోజు. మా ప్రభుత్వం చేపట్టే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో బాలికల సాధికారతకు, నారీశక్తిని బలోపేతం చేయడానికి అధిక ప్రాధాన్యమిస్తాము. అమ్మాయిల అత్మగౌరవంతోపాటు వారికి గల అపార అవకాశాలపైన కూడా దృష్టి సారించాం’ అని ప్రధాని మోదీ ట్వీట్ లో పేర్కొన్నారు.

మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా దీనిపై స్పందించారు. దేశంలో బాలికల సాధికారత కోసం ‘బేటీ బచావో.. బేటీ పడావో’ వంటి వినూత్న పథకాలను ప్రధాని మోదీ ప్రవేశపెట్టారని తెలిపారు. నేడు జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ఆయన బాలికలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు. ప్రధాని మోదీ మహిళల అభివృద్ధిపై దృక్పథాన్నే మార్చేశారని, వారికి ఎన్నో అవకాశాలు కల్పించారని చెప్పారు. నేడు దేశంలోని అమ్మాయిలంతా ప్రతి రంగంలోనూ రాణించి భారత్ కు ఖ్యాతి తీసుకొస్తున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న వివిధ పథకాలు, విధానాలతో.. దేశంలో అమ్మాయిల నిష్పత్తి పెరిగిందని చెప్పుకొచ్చారు. ఇటీవల నిర్వహించిన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం దేశంలో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 1,020 మంది బాలికలున్నట్లు తేలిందని అమిత్ షా గుర్తు చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here