దేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ : రాష్ట్రాలకు ఇప్పటికే 163 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసులు అందజేత

Covid-19 Vaccination : More than 13.60 Cr Vaccine Doses Still Available with States, UTs, Corona Vaccination Drive, Corona Vaccination Programme, coronavirus vaccine distribution, COVID 19 Vaccine, Covid Vaccination, Covid vaccination in India, Covid-19 Vaccination Distribution, Covid-19 Vaccination Drive, Covid-19 Vaccine Distribution, Covid-19 Vaccine Distribution News, Covid-19 Vaccine Distribution updates, Distribution For Covid-19 Vaccine, India Covid Vaccination, Mango News, Vaccine Distribution

దేశంలో కోవిడ్-19 మహమ్మారిపై పోరాటంలో భాగంగా ప్రస్తుతం 15 ఏళ్లు పైబడివారందరికీ కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ముందుగా దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ జనవరి 16, 2021న ప్రారంభమైంది. అనంతరం జూన్ 21,2021 నుంచి కేంద్రప్రభుత్వం కొత్త వ్యాక్సినేషన్ విధానం అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా దేశంలోని వ్యాక్సిన్ తయారీదారులు ఉత్పత్తి చేస్తున్న వ్యాక్సిన్లలో 75% కేంద్ర ప్రభుత్వం సమీకరించి రాష్ట్రాలకు/కేంద్రాలకు ఉచితంగా సరఫరా చేస్తుంది. దీంతో వ్యాక్సిన్‌ ల లభ్యత పెరగడం, వ్యాక్సిన్ సరఫరా క్రమబద్ధీకరించడం ద్వారా దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ పక్రియ ఊపందుకుంది.

ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ లో భాగంగా అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ఇప్పటివరకు అందించిన మరియు ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిడ్ వ్యాక్సిన్ డోసుల వివరాలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం ఉచిత కేటగిరీ, ప్రత్యక్ష రాష్ట్ర సేకరణ కేటగిరి ద్వారా ఇప్పటికి మొత్తం 163.71 కోట్లకుపైగా (1,63,71,18,725) కోవిడ్ వ్యాక్సిన్ డోసులను రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు అందించినట్టు తెలిపారు. అలాగే అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో జనవరి 27, గురువారం నాటికీ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించేందుకు దాదాపు 13 కోట్ల (13,60,98,246) నిల్వలు, వినియోగించని వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + 5 =