ఢిల్లీలో నూతన ఎక్సైజ్ పాలసీ, తెల్లవారుజామున 3 గంటల వరకు బార్లకు అనుమతి

Bars in Hotels, Bars permitted to operate, Bars to open till 3am, Bars to open till 3am In Delhi, Clubs and Restaurants Permitted to Open Till 3 AM, Delhi Bars to open till 3am, Delhi New Liquor Policy, Delhi’s new excise policy, Delhi’s new liquor policy, Delhi’s New Liquor Rules, Department of Excise Entertainment & Luxury Tax Govt, Excise Policy 2021-22, Mango News, New liquor policy in Delhi

ఢిల్లీ ప్రభుత్వం సోమవారం నాడు 2021-22 నూతన ఎక్సైజ్ పాలసీని ప్రకటించింది. ఈ నూతన ఎక్సైజ్ పాలసీలో భాగంగా ఢిల్లీలో హోటళ్ళు, క్లబ్బులు మరియు రెస్టారెంట్లలోని బార్లు తెల్లవారుజామున 3 గంటల వరకు తెరిచి ఉండటానికి అనుమతి ఇచ్చారు. ముందుగా లైసెన్స్ పొందిన హోటళ్ళు మరియు రెస్టారెంట్లలో బాల్కనీ, టెర్రస్ వంటి ప్రదేశాల్లో మద్యం సేవించాలని ఎక్సైజ్ విధానంలో పేర్కొన్నారు.

ఎక్సైజ్ ఢిల్లీ ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉందని, ఈ కొత్త పాలసీ ద్వారా ఆదాయాన్ని పెంచడంతో పాటు, మద్యం మాఫియాను అరికట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. అయితే ఇప్పటికే ప్రకటించినప్పటికీ ఢిల్లీలో చట్టబద్దమైన మద్యపాన వయస్సును 25 సంవత్సరాల నుండి 21 సంవత్సరాలకు తగ్గించడంపై ఈ పాలసీలో ప్రస్తావించలేదు. మరోవైపు కొత్త విధానం ప్రకారం ఇకపై ఢిల్లీ ప్రభుత్వం రిటైల్ మద్యం వ్యాపారంలో యాక్టీవ్ గా పాల్గొనదు. దీంతో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే దుకాణాలను మూతపడి, ప్రైవేట్ దుకాణాలకు ప్రోత్సాహం లభించనుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × two =