గర్భిణీలు, 18 సంవత్సరాల లోపువారికి 2 డీజీ ఔషధాన్ని ఇవ్వొద్దు : డీఆర్‌డీవో

2 DG Anti Covid Drug, 2DG approved for emergency use, 2DG approved for emergency use as adjunct therapy, COVID-19, Covid-19 Patients, DRDO, DRDO 2DG Medicine, DRDO Anti-COVID Drug 2DG, DRDO Anti-COVID Drug 2DG is Now Available for Patients, DRDO approves 2DG for emergency use, DRDO Issued Directions for Use of 2DG Drug, DRDO Issued Directions for Use of 2DG Drug for Covid-19, DRDO Issued Directions for Use of 2DG Drug for Covid-19 Patients, DRDO issues direction for use of 2DG medicine, DRDO Shares Directions to Administer 2DG Drug, DRDO shares guidelines on when to administer 2DG drug, Mango News, When DRDO’s 2DG drug can be used

కరోనా బాధితుల చికిత్స కోసం భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో), డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ సహకారంతో 2-డియాక్సీ డి-గ్లూకోజ్‌(2డీజీ) ఔషధాన్ని అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. కరోనా చికిత్సలో అత్యవసర వినియోగానికి సంబంధించి డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ) అనుమతి ఇచ్చిన అనంతరం ఈ 2 డీజీ ఔషధ సాచెట్లను విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఈ ఔషధ వినియోగానికి సంబంధించి డీఆర్‌డీవో మంగళవారం నాడు మార్గదర్శకాలను విడుదల చేసింది. కరోనా రోగులకు 2 డీజీ ఔషధాన్ని వైద్యుల సంరక్షణ మరియు ప్రిస్క్రిప్షన్ కింద ఇవ్వవచ్చని పేర్కొన్నారు.

డీసీజీఐ అనుమతి ప్రకారం కరోనా రోగులకు 2 డీజీ ఔషధ వినియోగానికి సూచనలు:

  • ఆసుపత్రుల్లో కరోనా రోగుల చికిత్సలో అనుబంధ చికిత్సగా అత్యవసర ఉపయోగం కోసం 2 డీజీ ఆమోదించబడింది.
  • ఈ 2 డీజీ ఔషధాన్ని వీలైనంత త్వరగా వైద్యులు మధ్యస్తం నుంచి తీవ్ర లక్షణాలతో బాధపడుతున్న కరోనా రోగులకు గరిష్టంగా 10 రోజుల వరకు సూచించాలి.
  • అనియంత్రిత మధుమేహం, తీవ్రమైన గుండె సమస్య, ఏఆర్డీఎస్(అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్), తీవ్రమైన హెపాటిక్ మరియు రెనాల్ ఇంపైర్మెంట్ ఉన్నరోగులపై 2 డీజీ ఔషధం ఇంకా అధ్యయనం చేయలేదు, అందువల్ల వారంతా జాగ్రత్త వహించాలి.
  • గర్భిణీలు, పాలిచ్చే మహిళలు మరియు 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారికీ 2 డీజీ ఔషధాన్ని ఇవ్వకూడదు.
  • కరోనా రోగులు లేదా సంబంధిత వ్యక్తులు 2 డీజీ ఔషధ సరఫరా కోసం [email protected] మెయిల్ ద్వారా డాక్టర్ రెడ్డి ల్యాబ్ సంస్థను సంప్రదించమని తమ ఆసుపత్రులను కోరాలని డీఆర్‌డీవో సూచించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + twenty =