కరోనా ఎఫెక్ట్ : సీబీఎస్‌ఈ 12వ తరగతి బోర్డు పరీక్షలు రద్దు

CBSC Board Exams, CBSC Board Exams Cancel News, CBSC Board Exams Cancelled, CBSC Board Exams News, CBSE, cbse board exam 2021 class 12, CBSE Class 12 board exam cancelled, CBSE Class 12 board exams 2021 cancelled, CBSE Class 12 board exams cancelled, CBSE class 12 exams cancelled, Govt of India Decided to Cancel Class 12 CBSC Board Exams, ICSE Board Class 12 Exam 2021 LIVE Updates, Mango News, States welcome decision to cancel CBSE Class 12 board exam

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ పరిస్థితుల నేపథ్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) 12వ తరగతి వార్షిక పరీక్షలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఎస్‌ఈ  12వ తరగతి బోర్డు పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఫలితాలను సమయానుసారంగా ఆబ్జెక్టివ్ ప్రమాణాల ప్రకారం ప్రకటించేందుకు సీబీఎస్‌ఈ చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు. మరోవైపు బోర్డు నిర్ణయించిన ప్రాతిపదికన విద్యార్థులు/విద్యార్థినిలకు కేటాయించిన మార్కులతో ఎవరైనా సంతృప్తి చెందకపొతే, వారికీ పరీక్షలు నిర్వహించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు పరీక్ష రాసే అవకాశం ఇవ్వబడుతుందని తెలిపారు.

శుక్రవారం సాయంత్రం సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వాలు సహా ఇతర సంబంధిత వర్గాలతో ఇప్పటివరకు నిర్వహించిన విస్తృత సంప్రదింపులపై అధికారులు ప్రధాని మోదీకి వివరించారు. దేశంలో నెలకున్న అనిశ్చిత పరిస్థితులు, సంప్రదింపుల్లో వ్యక్తమైన అభిప్రాయాల దృష్ట్యా ఈ సంవత్సరం సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలు రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత పరిస్థితిలో విద్యార్థుల ఆరోగ్యం గురించి విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు సహజంగానే ఆందోళన చెందుతారని, ఇలాంటి ఒత్తిడితో విద్యార్థులను బలవంతంగా పరీక్షలకు హాజరయ్యేలా చేయకూడదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. విద్యార్థుల ఆరోగ్యం మరియు భద్రతకు చాలా ప్రాముఖ్యత ఉందని, ఈ విషయంలో రాజీ ఉండదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. మరోవైపు సీబీఎస్‌ఈ 10వ తరగతి పరీక్షలు రద్దు చేస్తునట్టు గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + twenty =