టీ-20 క్రికెట్ కు మిథాలీ రాజ్ గుడ్ బై

2019 Latest Sport News, 2019 Latest Sport News And Headlines, latest sports news, latest sports news 2019, Mango News Telugu, Mithali Raj Announces Retirement, Mithali Raj Announces Retirement From Cricket, Mithali Raj Announces Retirement From T20 Cricket, Mithali Raj Latest News, Mithali Raj Retirement From T20 Cricket, sports news

భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ టీ-20 క్రికెట్ కు వీడ్కోలు పలికింది. ప్రపంచ మహిళా క్రికెట్ లో తన సత్తా చాటి ఎన్నో రికార్డులు సాధించిన మిథాలీ రాజ్ తాజాగా టీ-20 ఫార్మాట్ కు గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించారు. 2021 లో జరగబోయే ఐసీసీ వన్డే మహిళల ప్రపంచకప్ పై దృష్టి సారించడంకోసమే టీ-20 క్రికెట్ కు దూరమవుతున్నానని ఆమె తెలిపింది. భారత్ తరుపున 89 టీ-20 మ్యాచులు ఆడిన మిథాలీ రాజ్ 37.52 సగటుతో 2364 పరుగులు చేసింది. 2006లో భారత టీ-20 జట్టుకు తోలి కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించి, 32 మ్యాచులకు కెప్టెన్ గా వ్యవరించారు.

2012, 2014, 2016 టీ-20 ప్రపంచకప్ లలో ఆడిన మిథాలీ రాజ్ భారత్ తరుపున అత్యధిక పరుగులు సాధించిన క్రీడాకారిణిగా రికార్డ్ సాధించింది. టీ-20 లలో ఆమె అత్యుత్తమ స్కోర్ 97 కాగా, ఈ ఏడాది మార్చ్ లో ఇంగ్లాండ్ తో చివరి టీ20 మ్యాచ్ ఆడింది. దేశానికి వన్డే ప్రపంచకప్ అందించాలన్నది తన లక్ష్యం, కల అని, ఆ టోర్నీకి సిద్ధమయ్యేందుకే టీ20 ఫార్మాట్ కు దూరమవుతున్నానని మిథాలీ రాజ్ చెప్పింది. తనను ఎప్పుడూ ప్రోత్సహించిన బీసీసీఐ ధన్యవాదాలు చెప్పింది. త్వరలో దక్షిణాఫ్రికాతో జరగబోయే టీ20 సిరీస్ లో తలబడే భారతజట్టుకు మిథాలీ రాజ్ అభినందనలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 2 =