ప్రముఖ దక్షిణాది నటుడు, డైరెక్టర్ ప్రతాప్ పోతన్ కన్నుమూత.. ప్రముఖుల సంతాపం

Famous South Indian Actor and Filmmaker Prathap Pothen Passes Away, Actor and Filmmaker Prathap Pothen Passes Away, Filmmaker Prathap Pothen Passes Away, Famous South Indian Actor Prathap Pothen Passes Away, Senior Actor and Director Prathap Pothen Passes Away, Latest Telugu Movies News, Telugu Film News 2022, Tollywood Movie Updates, Tollywood Movie Latest Updates, Tollywood Latest News, Prathap Pothen, Senior Actor Prathap Pothen, Senior Actor and Director Prathap Pothen, Senior Actor And Director Prathap Pothen Passes Away Today, Prathap Pothen Passes Away, Prathap Pothen Movies, Prathap Pothen directed Movies, Prathap Pothen Latest Acted Movies, Prathap Pothen Last Movie, Prathap Pothen Movies In Telugu, Senior Actor Prathap Pothen Passes Away, Mango News, Mango News Telugu,

సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దక్షిణాది నటుడు, డైరెక్టర్‌ ప్రతాప్‌ పోతన్‌ కన్నుమూశారు. ఈయన సీనియర్‌ నటి రాధిక మాజీ భర్త కావడం విశేషం. చెన్నైలోని తన నివాసంలో శుక్రవారం ఉదయం ఆయన విగత జీవిగా కనిపించారు. అయితే ఆయన మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రముఖ మలయాళ హీరో పృధ్విరాజ్ సుకుమారన్ ఆయన మృతి వార్తను నిర్ధారిస్తూ ట్వీట్ చేశారు. కాగా ప్రతాప్‌ పోతన్‌ స్వతహాగా మలయాళ నటుడైనప్పటికీ అనేక తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సినిమాల్లో చేశారు. ఆయన సినిమాల్లో బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందారు. కేవలం నటుడిగానే కాకుండా పలు చిత్రాలకు డైరెక్టర్‌గా, మరికొన్నింటికి నిర్మాతగా కూడా వ్యవహరించారు.

తెలుగులో.. మరో చరిత్ర, ఆకలిరాజ్యం, డబ్బు డబ్బు డబ్బు, అమాయకుడు కాదు అసాధ్యుడు, కాంచనగంగ వంటి చిత్రాల్లో నటించారు. అక్కినేని నాగార్జున నటించిన ‘చైతన్య’ చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు. ఇక 1985లో ప్రతాప్ పోతన్ ప్రముఖ నటి రాధికను వివాహం చేసుకున్నారు. అయితే అతికొద్ది కాలంలోనే (1986లో) వీరిద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు. ప్రతాప్ పోతన్ చివరిసారిగా ఇటీవల విడుదలైన మలయాళ చిత్రం ‘సిబిఐ 5’ లో తెరపై కనిపించారు. ప్రతాప్ పోతన్ మరణ వార్త తెలిసిన దక్షిణాది రాష్ట్రాలకు చెందిన పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు, నటీనటులు సోషల్‌ మీడియా వేదికగా తమ సంతాపం ప్రకటిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − 3 =