భద్రాచలంలో గోదావరి ఉగ్రరూపం, ప్రస్తుతం మూడో ప్రమాద హెచ్చరిక అమలు

Godavari Flood Situation at Bhadrachalam Water Level in the River Crosses 68.70 Feet Mark, Water Level in the River Crosses 68.70 Feet Mark, Godavari Flood Situation at Bhadrachalam, Godavari Water Level in the River Crosses 68.70 Feet Mark, 68.70 Feet Mark, flood situation in river Godavari at Bhadrachalam, Godavari in spate at Bhadrachalam, Flood Levels Increased in river Godavari at Bhadrachalam, Godavari turns perilous at Bhadrachalam, Flood level crosses third warning level, Godavari Flood Situation, Flood Situation, river Godavari, Godavari Flood Situation at Bhadrachalam News, Godavari Flood Situation at Bhadrachalam Latest News, Godavari Flood Situation at Bhadrachalam Latest Updates, Godavari Flood Situation at Bhadrachalam Live Updates, Mango News, Mango News Telugu,

భద్రాచలంలో గోదావరి ఉగ్రరూపం కొనసాగుతుంది. వర్షాల కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద పోటెత్తడంతో భద్రాచలంలో గోదావరి నీటిమట్టం వేగంగా పెరుగుతుంది. జూలై 15, శుక్రవారం ఉదయం 11:00 గంటలకు భద్రాచలంలో గోదావరి నీటి మట్టం 68.70 అడుగులకు చేరుకుందని, క్రిందికి నీటి విడుదల 22,99,090 క్యూస్సెకులగా ఉందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. అలాగే ప్రస్తుతం మూడో ప్రమాద హెచ్చరిక అమలులో ఉందని చెప్పారు. ఇక వరద పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రక్షణ చర్యల్లో భాగంగా జూలై 14, గురువారం సాయంత్రం 5 గంటల నుండి గోదావరి వంతెనపై రాక పోకలు నిలిపివేశారు. రానున్న 48 గంటల పాటు వంతెనపై రవాణా నిలిపి వేస్తున్నామని ప్రజలు గమనించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ సూచించారు.

అదేవిధంగా గోదావరి వరద ఉధృతి దృష్ట్యా ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా ముందస్తు రక్షణ చర్యల్లో భాగంగా భద్రాచలం, బూర్గంపాడు మండలాల ప్రజలు బయటికి రాకుండా నియంత్రణ చేసేందుకు 144 సెక్షన్ విధించినట్లుగా జిల్లా కలెక్టర్ అనుదీప్ ప్రకటించారు. మరోవైపు జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, కలెక్టర్ అనుదీప్ భధ్రాచలంలోనే ఉంటూ, నిరంతరం వరద సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. భద్రాచలంలో గోదావరి వరద ఉదృతికి లోతట్టు ప్రాంతాల్లోని సుభాష్ నగర్, శాంతి నగర్, ఏఎంసీ కాలనీ లో వరుద నీరు చేరడంతో ఆయా ప్రాంత ప్రజలతో మంత్రి పువ్వాడ అజయ్ స్వయంగా మాట్లాడి, వారిని అక్కడినుంచి ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇక ప్రమాదకర స్థాయిలో వరద ఉధృతి కొనసాగుతుండడంతో మరికొన్ని గంటల్లో గోదావరి నీటిమట్టం 70 అడుగులు దాటే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాకపోకల నిలిపివేతతో జనజీవనం కొంత స్తంభించిపోయింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + 17 =