రాష్ట్రంలో రోడ్ల దుస్థితి తెలిపేందుకు జనసేన డిజిటల్ క్యాంపెయిన్ : పవన్ కళ్యాణ్

Janasena Conduct Digital Campaign to Show the Condition of Roads in the State - Pawan Kalyan, Janasena Pawan Kalyan launches digital campaign on AP roads, Janasena digital campaign on AP roads, digital campaign on AP roads, Digital Campaign to Show the Condition of Roads in the State, Condition of Roads in the State, Janasena Conduct Digital Campaign, Janasena Party, Janasena Digital Campaign, Janasena Party President Pawan Kalyan, Janasena Party Chief Pawan Kalyan, Pawan Kalyan, Janasena Party President, Janasena Digital Campaign News, Janasena Digital Campaign Latest News, Janasena Digital Campaign Latest Updates, Janasena Digital Campaign Live Updates, Mango News, Mango News Telugu,

రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి, కనీసం మరమ్మతులు చేయాలనే బాధ్యతను వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేసిందని, వారికి బాధ్యత గుర్తు చేయాలనే #GoodMorningCMSir అనే హాష్ ట్యాగ్ తో జూలై 15, 16, 17 తేదీల్లో జనసేన పార్టీ డిజిటల్ క్యాంపెయిన్ ప్రారంభిస్తోందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. గత ఏడాది సెప్టెంబర్ 2, 3, 4 తేదీల్లో దెబ్బతిన్న రోడ్ల దుస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలా #JSPForAP_Roads అనే హాష్ ట్యాగ్ తో డిజిటల్ క్యాంపెయిన్ చేశామని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు.

“ఇప్పుడున్న పరిస్థితుల్లో రోడ్లు కనీస మరమ్మతులు, ఒక లేయర్ వేసి కాస్త ప్రయాణానికి తగ్గ విధంగా చేయాలంటే దాదాపు రూ.7 వేల కోట్లు అవసరమని అంచనా. 8 వేల కిమీ రోడ్లు మెయింటినెన్స్ కోసం బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ.2100 కోట్లు అప్పు తెచ్చారు. వాటితో రిపేర్లు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. అయితే ప్రభుత్వం నుంచి బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు చేయడం లేదు. రోడ్లు నిర్వహణ కోసం అని పెట్రోసెస్ వసూలు చేస్తున్నారు. ఇది రూ.750 కోట్ల మేర ఏటా ప్రభుత్వానికి చేరుతుంది. ఈ నిధులు ఎక్కడికి వెళ్తున్నాయో ఎవరికి తెలియడం లేదు. రాష్ట్ర అభివృద్ధికి మౌలిక సదుపాయాలు ఎంత అవసరమో తెలియజేయడం కోసం #GoodMorningCMSir అనే డిజిటల్ క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ డిజిటల్ క్యాంపెయిన్ లో నేను కూడా పాల్గొంటాను. మీరు కూడా పాల్గొని విజయవంతం చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను” అని పవన్ కళ్యాణ్ అన్నారు.

ఇక రోడ్ల దుస్థితిపై జనసేన చేపడుతున్న డిజిటల్ క్యాంపెయిన్ లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు పవన్ కళ్యాణ్ రావులపాలెం నుంచి అమలాపురం వెళ్ళే రోడ్డు దుస్థితిని తెలిపి వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేశారు. అలాగే రాష్ట్రంలో రోడ్డు ప్రయాణం ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలియచేసేలా ఉన్న వ్యంగ్య చిత్రాన్ని కూడా పవన్ కళ్యాణ్ పోస్టు చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + thirteen =