ఫిఫా ప్రపంచ కప్: ముగిసిన లీగ్ దశ, నేటి నుంచే నాకౌట్ సమరం.. ఏ రోజు, ఎవరితో ఎవరంటే?

FIFA World Cup 2022 Round of 16 The Knockout Matches Starts From Today Check For The Full Schedule,FIFA World Cup,FIFA League Phase Over,FIFA Knockout Competition From Today,Mango News,Mango News Telugu,World Cup 2022 Knockout Stage,FIFA World Cup Schedule,FIFA Knockout Bracket,FIFA World Cup,FIFA World Cup Schedule 2022,FIFA World Cup 2022 Schedule,2022 FIFA World Cup Qatar,2022 FIFA World Cup Knockout Stage,FIFA World Cup Qatar 2022,FIFA World Cup 2022 Schedule

ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచ కప్ తదుపరి దశకు చేరుకుంది. శుక్రవారంతో గ్రూప్ దశలు ముగియగా శనివారం నుంచి రౌండ్ ఆఫ్ 16 ప్రారంభం కానుంది. నాకౌట్‌ తరహాలో సాగనున్న ఈ పోటీల్లో ఓడిపోయిన జట్టు ఇంటి ముఖం పట్టాల్సి ఉంటుంది. నిర్ణీత వ్యవధి ముగిసేలోపు గోల్ చేయలేకపోతే పెనాల్టీ షూటౌట్‌కు దారి తీస్తుంది. గ్రూప్ దశలో అనేక సంచలనాల మధ్య మొత్తం 16 జట్లు నాకౌట్ దశకు చేరుకున్నాయి. కొన్ని చిన్న జట్లు దిగ్గజాలకు షాకిచ్చాయి. ఇక ఇప్పటివరకు గ్రూప్ దశలో మూడు మ్యాచ్‌లు గెలిచిన తర్వాత ఏ జట్టు కూడా తదుపరి రౌండ్‌కు వెళ్లలేదు. మొరాకో, ఇంగ్లండ్ మరియు నెదర్లాండ్స్ ఈ రౌండ్‌లో అత్యధిక పాయింట్లు (7) సాధించాయి, రెండింట్లో గెలిచి ఒకటి డ్రా చేసుకున్నాయి. అర్జెంటీనా, ఫ్రాన్స్, జపాన్, బ్రెజిల్ మరియు పోర్చుగల్ చెరో ఆరు పాయింట్లు సాధించి, రెండింట్లో గెలిచి, ఒకటి కోల్పోయింది. జర్మనీ, బెల్జియం, మెక్సికో, ఉరుగ్వే గ్రూప్‌ దశ నుంచే నిష్క్రమించాయి. ఇక నేడు నెదర్లాండ్స్-అమెరికా జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుండగా, శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత అర్జెంటీనా-ఆస్ట్రేలియా జట్లు రెండో మ్యాచ్‌ లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లను భారతదేశంలో స్పోర్ట్స్ 18 మరియు స్పోర్ట్స్ 18 హెచ్ డీ టీవీ ఛానెల్స్ లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. అలాగే జియో సినిమా యాప్ మరియు వెబ్‌సైట్ రెండూ ఈవెంట్ యొక్క ఉచిత ప్రత్యక్ష ప్రసారాన్ని అందిస్తాయి.

రౌండ్ ఆఫ్ 16 పూర్తి షెడ్యూల్.. ఏ రోజు, ఎవరితో ఎవరంటే?

  • డిసెంబర్ 3 – 8:30 PM నెదర్లాండ్స్ vs అమెరికా
  • డిసెంబర్ 4 – 12:30 AM అర్జెంటీనా vs ఆస్ట్రేలియా
  • డిసెంబర్ 4 – 8:30 PM ఫ్రాన్స్ vs పోలాండ్
  • డిసెంబర్ 5 – 12:30 AM ఇంగ్లాండ్ vs సెనెగల్
  • డిసెంబర్ 5 – 8:30 PM జపాన్ vs క్రొయేషియా
  • డిసెంబర్ 6 – 12:30 AM బ్రెజిల్ vs దక్షిణ కొరియా
  • డిసెంబర్ 6 – 8:30 PM మొరాకో vs స్పెయిన్
  • డిసెంబర్ 7 – 12:30 AM పోర్చుగల్ vs స్విట్జర్లాండ్

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + 10 =