ఢిల్లీలో నైట్ కర్ఫ్యూ ఎత్తివేత, ఏప్రిల్ 1 నుండి పాఠశాలల్లో పూర్తిస్థాయి ఆఫ్‌లైన్ తరగతులు

DDMA Decides to Lift Night Curfew and All other Covid Restrictions, DDMA Decides to Lift Night Curfew, DDMA Decides to Lift All other Covid Restrictions, Night Curfew, Covid Restrictions, DDMA, Delhi Disaster Management Authority, Delhi Disaster Management Authority Decides to Lift Night Curfew, India Covid-19 Updates, India Covid-19 Live Updates, India Covid-19 Latest Updates, Coronavirus, coronavirus India, Coronavirus Updates, COVID-19, COVID-19 Live Updates, Covid-19 New Updates, Mango News, Mango News Telugu,

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. కరోనా పాజిటివ్ కేసులు నమోదు తగ్గడంతో ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (డీడీఎంఏ) శుక్రవారం నాడు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఢిల్లీలో సోమవారం నుంచి నైట్ కర్ఫ్యూను ఎత్తివేయాలని డీడీఎంఏ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు. ప్రస్తుతం రాత్రి 10 నుండి ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ కొనసాగుతుండగా, తాజాగా పూర్తిగా ఎత్తివేస్తున్నట్టు ప్రకటించారు.

అలాగే ఏప్రిల్ 1 నుండి ఢిల్లీలో అన్ని పాఠశాలలు తప్పనిసరిగా పూర్తిస్థాయి ఆఫ్‌లైన్ తరగతులను ప్రారంభించాలని ఆదేశాలు ఇచ్చారు. ఇక మాస్క్‌లు ధరించక వారికీ విధించే జరిమానా మొత్తాన్ని రూ.2,000 నుండి రూ.500కి తగ్గించారు. మరోవైపు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేస్తూ ప్రజలంతా నిబంధనలను తప్పనిసరిగా అనుసరించాలని, ప్రభుత్వం గట్టి నిఘా ఉంచుతుందని చెప్పారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − 9 =