దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్‌జెండర్ల సంక్షేమ శాఖ ఏర్పాటు, సీఎం కేసీఆర్ కు మంత్రి కొప్పుల ధన్యవాదాలు

Telangana Govt Forms Department for Empowerment of Persons with Disabilities Senior Citizens and Transgender Persons,Minister Koppula Thanks Cm Kcr,Welfare Department For Disabled, Welfare Department Elderly,Welfare Department Transgenders,Mango News,Mango News Telugu,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం (డిసెంబర్ 3) సందర్భంగా తెలంగాణ దివ్యాంగులకు తీపి కబురు అందించింది. తాజాగా దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్ల సంక్షేమ శాఖను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు డిసెంబర్ 2న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు రాష్ట్ర స్త్రీ సంక్షేమ శాఖకు అనుబంధంగా ఉన్న దివ్వాంగుల మరియు వయోజన సంక్షేమ శాఖ ఇకపై స్వయం ప్రతిపత్తితో పని చేయనుందని తెలిపారు. స్త్రీ సంక్షేమ శాఖ నుండి దివ్వాంగుల శాఖను వేరు చేయడం ద్వారా దివ్వాంగుల, వయోజన సంక్షేమానికి సత్వర నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు కలుగుతుందనే విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తోడ్పాటుతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. దివ్యాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా గుర్తించేందుకు మంత్రి కొప్పుల ఈశ్వర్ పలు పర్యాయాలు ముఖ్యమంత్రి కేసీఆర్ తో ప్రత్యేకంగా చర్చించినట్టు తెలిపారు. దివ్యాంగుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ మాట నిలపెట్టుకున్నారని, స్త్రీ శిశు సంక్షేమ వయోజన సంక్షేమ శాఖగా ఉన్న దివ్యాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేకంగా దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖగా మార్చారని చెప్పారు.

డిపార్ట్మెంట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబులిటీ సీనియర్ సిటిజన్స్ అండ్ ట్రాన్స్ జెండర్స్ పర్సన్స్ (దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్‌జెండర్ల సంక్షేమ శాఖ) మార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో ప్రభుత్వ ఉత్తర్వులు 33, 34 జారీ చేయడం జరిగిందని చెప్పారు. దివ్యాంగుల సంక్షేమ శాఖ ఇక నుండి స్వతంత్ర శాఖగా వ్యవహరించనున్నది. దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏర్పాటు చేసినందుకు మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఒకరోజు ముందుగానే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల మంత్రి కొప్పుల ఈశ్వర్ సంతోషం వ్యక్తం చేశారు.

అలాగే దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లు అండ్ ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకు సమర్థవంతమైన సేవలను అందించడానికి జిల్లా స్థాయిలో దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ల సంక్షేమ శాఖను మహిళా అభివృద్ధి అండ్ శిశు సంక్షేమ శాఖ నుండి వేరు చేయడం జరిగింది. దివ్యాంగులు మరియు సీనియర్ సిటిజన్ల సంక్షేమం కోసం అసిస్టెంట్ డైరెక్టర్/జిల్లా హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్ యొక్క కేటగిరీని దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లు, ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల కోసం జిల్లా సంక్షేమ అధికారిగా తిరిగి నియమించడం జరుగుతుంది. అందుబాటులో ఉన్న క్యాడర్ స్ట్రెంత్‌ను పునఃపంపిణీ చేయడానికి ప్రభుత్వం అవసరమైన ఉత్తర్వులు జారీ చేయనుంది. మహిళా, శిశు సంక్షేమం మరియు దివ్యాంగులు సంక్షేమ శాఖల మధ్య ప్రతి జిల్లాకు డిపార్ట్‌మెంట్ మరియు వర్కింగ్ అరేంజ్‌మెంట్ చేయనున్నట్టు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × four =