ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డు, ప్రధాని మోదీ, పలువురు రాజకీయ, సినీ ప్రముఖుల ప్రశంసలు

RRR's Naatu Naatu Song Wins Oscar Award in Best Original Song Category PM Modi Political Cine Celebrities Extends Congratulates,RRR's Naatu Naatu Song Wins Oscar,Oscar Award in Best Original Song Category,PM Modi Extends Congratulates,Political Cine Celebrities Extends Congratulates,Mango News,Mango News Telugu,Latest Telugu Movies News,Telugu Film News 2023,RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Movie Updates,RRR Movie Latest News,RRR Movie Songs,RRR Naatu Naatu Song,RRR Naatu Naatu,Naatu Naatu Song,Naatu Naatu,Naatu Naatu Video Song,Oscars,Oscars 2023,RRR Oscars 2023,RRR Naatu Naatu Song Oscars 2023,Naatu Naatu Full Video Song,Oscars 95,95th Academy Awards,Academy Awards,Global Star Ram Charan,RRR at OSCARS,Man Of Masses Ram Charan,SS Rajamouli,Ram Charan,Ram Charan Movies,Jr NTR,Jr NTR Movies,MM Keeravani,Lyricist Chandra Bose,Oscars 2023 Live Updates,Oscars 2023 Highlights,Indian Prime Minister Narendra Modi,PM Narendra Modi

ప్రపంచ సినీరంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ‘ఆస్కార్’ అవార్డును ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ‘నాటు నాటు’ సాంగ్ కైవసం చేసుకుని భారతీయ సినీ చరిత్రలో మరుపురాని ఘట్టాన్ని నమోదు చేసింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్‌ఆర్‌ఆర్ లోని ‘నాటు నాటు’ సాంగ్ (మ్యూజిక్:ఎంఎం కీరవాణి, లిరిక్స్:చంద్రబోస్, గానం:కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్, కొరియోగ్రాఫర్:ప్రేమ్ రక్షిత్) ఆస్కార్ అవార్డు దక్కించుకుంది. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, గీత రచయిత చంద్రబోస్ ఆస్కార్ అవార్డులను అందుకున్నారు. ఈ నేపథ్యంలో ‘నాటు నాటు’ సాంగ్ కు ఆస్కార్ అవార్డు రావడం పట్ల దేశంలోని పలువురు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు, మంత్రి కేటీఆర్, టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సహా వివిధ రంగాల ప్రముఖులు దర్శకుడు రాజమౌళికి, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, గీత రచయిత చంద్రబోస్ కు, ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.

ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ, “అసాధారణం.. ‘నాటు నాటు’కి ప్రపంచవ్యాప్త ఆదరణ ఉంది. ఎన్నో ఏళ్ల పాటుగా గుర్తుండిపోయే పాట ఇది. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, గీత రచయిత చంద్రబోస్ కు మరియు ఈ ప్రతిష్టాత్మక గౌరవం దక్కించుకున్న మొత్తం ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి అభినందనలు. భారతదేశం ఉల్లాసంగా, గర్వంగా ఉంది” అని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + 4 =