‘స్టీల్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ జంషెడ్ జె ఇరానీ కన్నుమూత

Former Director of Several Tata Group Companies The Steel Man of India Jamshed J Irani Passes Away, Former Director Tata Group Companies Jamshed J Irani, Jamshed J Irani Tata Group, Steel Man of India Jamshed J Irani, Mango News, Mango News Telugu, Jamshed J Irani Passes Away, Jamshed J Irani Latest News And Updates, Former Director of Several Tata Group Companies, The Steel Man of India Jamshed J Irani Passes Away, Tata Group

భారతదేశ ఉక్కు మనిషిగా పేరుగాంచిన ప్రముఖ వ్యాపారవేత్త, పలు టాటా గ్రూప్ కంపెనీల మాజీ డైరెక్టర్ జంషెడ్ జె ఇరానీ కన్నుమూశారు. ఈ మేరకు సోమవారం అర్థరాత్రి జంషెడ్‌పూర్‌లో మరణించారని టాటా స్టీల్ ఒక ప్రకటనలో తెలిపింది. ‘భారతదేశపు ఉక్కు మనిషి కన్నుమూశారు. పద్మభూషణ్ డాక్టర్ జంషెడ్ జె ఇరానీ మరణం గురించి టాటా స్టీల్ తెలియజేసేందుకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తోంది’ అని టాటా స్టీల్ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా ఆయన అక్టోబర్ 31, 2022న రాత్రి 10 గంటలకు జంషెడ్‌పూర్‌లోని టాటా హాస్పిటల్లో కన్నుమూశారు. ఇరానీ జూన్ 2011లో టాటా స్టీల్ బోర్డు నుండి పదవీ విరమణ చేశారు. 43 సంవత్సరాలకు పైగా టాటా కంపెనీకి వివిధ సేవలందించారు.

ఇక జంషెడ్ ఇరానీ 1936వ సంవత్సరం జూన్ 2వ తేదీన నాగ్‌పూర్‌లో జిజి ఇరానీ, ఖోర్షెడ్ ఇరానీ దంపతులకు జన్మించారు. 1963లో షెఫీల్డ్‌లోని బ్రిటిష్ ఐరన్ అండ్ స్టీల్ రీసెర్చ్ అసోసియేషన్‌లో ఫ్రెషర్‌గా చేరారు. ఆ తర్వాత 1968వ సంవత్సరంలో టాటా స్టీల్‌లో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఇన్‌ఛార్జ్ డైరెక్టర్‌కి అసిస్టెంట్‌గా చేరారు. అనంతరం 1981లో బోర్డ్ ఆఫ్ టాటా స్టీల్‌లో చేరారు. 2001 నుంచి పదేళ్ళపాటు నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కూడా ఉన్నారు. టాటా స్టీల్, టాటా సన్స్‌తో పాటు, డాక్టర్ ఇరానీ టాటా మోటార్స్, టాటా టెలిసర్వీసెస్‌తో సహా పలు టాటా గ్రూప్ కంపెనీలకు డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. కాగా ఇరానీకి భార్య డైసీ ఇరానీ,అతని ముగ్గురు పిల్లలు జుబిన్, నీలోఫర్, తనాజ్ ఉన్నారు.

డాక్టర్ ఇరానీ 1996లో రాయల్ అకాడమీ ఆఫ్ ఇంజినీరింగ్ యొక్క ఇంటర్నేషనల్ ఫెలోగా నియామకం మరియు 1997లో ఇండో-బ్రిటీష్ ట్రేడ్ మరియు కో-ఆపరేషన్‌కు చేసిన కృషికి గాను క్వీన్ ఎలిజబెత్-2 చే గౌరవ నైట్‌హుడ్‌తో సహా అనేక గౌరవాలు పొందారు. అలాగే భారత పారిశ్రామిక రంగానికి ఆయన చేసిన కృషికి గాను 2007లో ప్రభుత్వం పద్మభూషణ్‌తో సత్కరించింది. ఇక ఇరానీ మెటలర్జీ రంగంలో తన సేవలకు గుర్తింపుగా 2008లో భారత ప్రభుత్వంచే లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును కూడా అందుకున్నారు. కాగా జంషెడ్ జె ఇరానీ మృతిపట్ల దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + twenty =