18 మంది వ్యక్తులను ఉగ్ర‌వాదులుగా ప్రకటించిన‌ కేంద్ర హోంశాఖ

Centre designates 18 Pakistan-based terrorists, Eighteen more individuals declared as terrorists, Home affairs Declared 18 More Individuals as Terrorists, India declares 18 Pakistan-based individuals as terrorists, Ministry of Home Affairs, Ministry Of Home Affairs Declared Current List Of Terrorists, national news, national political news

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం ఆగస్టులో చట్టవిరుద్ధ కార్యకలాపాల (రక్షణ) చట్టం-1967 ను సవరించిన సంగతి తెలిసిందే. ఈ సవరణ ప్రకారం కార్యకలాపాలను బట్టి ఒక వ్యక్తిని ఉగ్రవాదిగా పేర్కొనే నిబంధనను చేర్చారు. ఈ సవరణకు ముందు కేవలం సంస్థలను మాత్రమే ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించే అవకాశం ఉంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఉగ్రవాదంపై పోరాడాలనే దేశం యొక్క సంకల్పానికి నిస్సందేహంగా పునరుద్ఘాటించారు. ఈ సవరించిన నిబంధన అమల్లోకి వచ్చాక, కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 2019 ‌లో నలుగురిని, జూలై 2020 తొమ్మిది మందిని ఉగ్రవాదులుగా ప్రకటించింది. తాజాగా నిబంధనల ప్రకారం మరో పద్దెనిమిది మంది వ్యక్తులను కేంద్ర హోమ్ శాఖ ఉగ్రవాదులుగా ప్రకటించింది.

వివిధ ఉగ్ర‌వాద ఘటనల్లో సంబంధం ఉన్న పాకిస్తాన్ ఆధారిత వక్తులైన సాజిద్ మీర్‌, యూసుఫ్ ముజ‌మ్మిల్‌, అబ్దుల్ రెహ్మాన్ మ‌క్కి, షాహిద్ మెహ‌మూద్‌, ఫ‌ర్హ‌తుల్లా ఘోరీ, అబ్దుల్ రౌఫ్ అసఘర్‌, ఇబ్ర‌హీం అత్త‌ర్‌, యూసుఫ్ అజ‌హ‌ర్‌, షాహిద్ ల‌తిప్‌, సయ్యద్ మొహ‌మ్మ‌ద్ యూసుఫ్ షా, గులామ్ న‌బీ ఖాన్‌, జాఫ‌ర్ హుస్సేన్ భ‌ట్‌, రియాజ్ ఇస్మాయిల్ షాబాద్రి, మ‌హ్మ‌ద్ ఇక్బాల్‌, షేక్ ష‌కీల్‌, మ‌హ్మ‌ద్ అనిస్ షేక్‌, ఇబ్ర‌హీమ్ మీన‌న్‌, జావెద్ చిక్నా లను ఉగ్రవాదులుగా కేంద్ర హోమ్ శాఖ ప్రకటించింది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + nineteen =