దేశంలో చిన్న రాష్ట్రాలలో ఒకటైన గోవాలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ లభించలేదు. ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్లుగానే ఇక్కడ హంగ్ ఏర్పడింది. 11 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే, 19 సీట్లతో బీజేపీ సింగల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. రెండో స్థానంలో కాంగ్రెస్ 12 స్థానాలతో ఉంది. ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ మరోసారి ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారం చేపట్టడానికి బీజేపీకి కేవలం 2 సీట్లు అవసరం కాగా.. స్వతంత్రులపై ఆపార్టీ కన్నేసింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా అధికారం చేపట్టే అవకాశాలపై దృష్టి సారించింది. తమ పార్టీ తరపున గెలిచిన అభ్యర్థులందరిని క్యాంపుకి తరలించింది.
- 40 అసెంబ్లీ స్థానాలున్న గోవాలో అధికారానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ – 21
- బీజేపీ 19 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.
- కాంగ్రెస్ 12 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
- ఆప్ పార్టీ 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
- ఇతరులు 7 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ