మార్చి 14న జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ, పోలీసుల అనుమతి జారీ

Janasena Party Formation Day Meeting on March 14 AP Police Issues Permission, Janasena Party Formation Day Meeting on March 14, AP Police Issues Permissions For Janasena Party Formation Day Meeting on March 14, Janasena Party Formation Day, Janasena Party, AP Police, Janasena Party Formation Day Meeting, Jana Sena Party will celebrate its Formation Day at Ippatam village, JSP, Ippatam village, Janasena Party gears up for formation day meet, Jana Sena Party, Jana Sena Party Latest News, Jana Sena Party Latest Updates, Mango News, Mango News Telugu,

మార్చి 14న జనసేన ఆవిర్భావ దినోత్సవ సభను ఘనంగా నిర్వహించాలని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. మార్చి 14న గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని ఇప్పటం గ్రామంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభను నిర్వహించనున్నారు. ఈ సభకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతూ గత నెల 28న డీజీపీకి లేఖ రాశామని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. కాగా ఎట్టకేలకు ఏపీ పోలీసులు అనుమతులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ డీజీపీకి, ఏపీ పోలీస్ శాఖకు నాదెండ్ల మనోహర్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఇక సభా ప్రాంగణానికి రాజకీయాలలో ఆదర్శంగా ఉన్న దామోదరం సంజీవయ్య పేరుతో ‘దామోదరం సంజీవయ్య చైతన్య వేదిక’ గా నామకరణం చేస్తునట్టు పేర్కొన్నారు.

మరోవైపు ఆవిర్భావ సభ నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన 12 కమిటీలతో మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో నాదెండ్ల మనోహర్ బుధవారం నాడు సమావేశమయ్యారు. సభ విజయవంతం చేయడానికి చేపట్టాల్సిన చర్యలు, కమిటీల విధి విధానాలపై చర్చించారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ ప్రసంగం కోసం లక్షల సంఖ్యలో జనసైనికులు, ప్రజలు తరలి రానున్నారని చెప్పారు. సభ నిర్వహణ కోసం‌ ఇప్పటికే మొత్తం 12 కమిటీలు పని చేస్తున్నాయని, సభను విజయవంతంగా నిర్వహిస్తామని అన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − 5 =