ఐసీఎస్‌ఈ 10వ తరగతి, ఐఎస్‌సీ 12వ తరగతి ఫలితాలు విడుదల

CISCE result 2021 Live Updates, ICSE 10th and ISC 12th Results, ICSE 10th and ISC 12th Results 2021, ICSE 10th and ISC 12th Results 2021 Released, ICSE 10th and ISC 12th Results 2021 Released Today, ICSE 10th Class ISC 12th Class Result 2021 Live, ICSE 10th ISC 12th Result 2021 Live, ICSE 10th ISC 12th Results 2021 Declared, ICSE 10th ISC 12th Results 2021 Declared Live Updates, ICSE 10th result 2021, ISC 12th Results 2021 Released, ISC 2021 results out, Mango News

ఇండియన్ సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (ఐసీఎస్‌ఈ) 10వ తరగతి, ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ (ఐఎస్‌సీ) 12వ తరగతి ఫలితాలు శనివారం నాడు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను కౌన్సిల్ ఫర్ ద ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎక్జామినేషన్స్ (సీఐఎస్‌సీఈ) ప్రకటించింది. 10 మరియు 12 తరగతుల విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్స్ cisce.org మరియు results.cisce.org లలో ఫలితాలను చూసుకోవచ్చని తెలిపారు. ఐసీఎస్‌ఈ 10వ తరగతిలో 99.98 శాతం, ఐఎస్‌సీ 12వ తరగతిలో 99.76 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.

దేశంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఏర్పడ్డ పరిస్థితుల దృష్ట్యా 10 మరియు 12 తరగతుల పరీక్షలను రద్దు చేస్తూ సీఐఎస్‌సీఈ నిర్ణయం తీసుకుంది. అనంతరం ఖచ్చితమైన మరియు నిష్పాక్షికమైన‌ క్రైటీరియాలో మార్కులు కేటాయించి ఫలితాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఐసీఎస్‌ఈ ఫలితాల కోసం 9వ తరగతి మరియు 10వ తరగతి ఇంటర్నల్ ఎగ్జామినేషన్ మార్కులను పరిగణించగా, ఐఎస్‌సీ ఫలితాల కోసం 11వ తరగతి మరియు 12వ తరగతి ఇంటర్నల్ పరీక్షల మార్కులను పరిగణనలోకి తీసుకున్నారు. మరోవైపు ఈ మార్కులతో విద్యార్థి/విద్యార్థిని సంతృప్తి చెందకపోయినా, మార్కుల కేటాయింపుకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉన్నా ఆగస్టు 1 లోగా సంబంధిత పాఠశాలకు దరఖాస్తు సమర్పించవచ్చని తెలిపారు. ఈ దరఖాస్తులను పాఠశాలలు సమీక్షించిన తర్వాత, ఇతర సంబంధిత పత్రాలతో పాటుగా సీఐఎస్‌సీఈకి పంపిస్తారని ప్రకటించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here