రెండో వన్డేలో శ్రీలంకపై భారత్ ఘనవిజయం.. రాణించిన కేఎల్‌ రాహుల్‌, సిరీస్‌ కైవసం చేసుకున్న భారత్‌

Ind vs SL 2nd ODI: Team India Beats Sri Lanka by Four Wickets - KL Rahul’s Unbeaten Fifty Helps To Seal The Series,Mango News,Mango News Telugu,Ind vs SL 2nd ODI Latest News,Ind vs SL 2nd ODI Live Updates,IND vs SL 2nd ODI Highlights,India vs Sri Lanka: 2nd ODI Highlights,India vs Sri Lanka 2nd ODI Highlights,KL Rahul's half-century leads IND to 4-wicket winInd Vs Sl 2nd Odi Live Score,ind vs sl 2nd odi 2023 highlights,ind vs sl 2nd odi 2023 live,ind vs sl 2nd odi 2023 highlights,ind vs sl 2nd odi 2023

శ్రీలంకతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన రెండో వన్డేలో భారత్ ఘనవిజయం సాధించింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 216 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో ఆరు ఓవర్లు మిగిలుండగానే ఛేదించింది. స్వల్ప ఛేదనే అయినా మంచు కురుస్తున్న నేపథ్యంలో బ్యాటింగ్‌ చేయడం కష్టంగా మారిన వేళ కేఎల్‌ రాహుల్‌ (103 బంతుల్లో 6 ఫోర్లతో 64 నాటౌట్‌) విలువైన ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. దీంతో మరో మ్యాచ్‌ ఉండగానే టీమిండియా 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇక అద్భుత బౌలింగ్ చేసిన కుల్దీప్‌ యాదవ్ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్ ఫలితంతో వన్డేల్లో ఎక్కువ మ్యాచ్‌లు (437) ఓడిన జట్టుగా శ్రీలంక నిలీచింది. అలాగే ఒకే ప్రత్యర్థిపై ఎక్కువసార్లు (భారత్‌పై 95) ఓడిన జట్టుగా న్యూజిలాండ్ (ఆసీస్‌ చేతిలో 95 సార్లు) సరసన నిలిచింది. కాగా మూడో మరియు ఆఖరి మ్యాచ్‌ ఆదివారం జరుగనుంది.

216 పరుగుల ఛేదనకు దిగిన భారత్‌, ఓపెనర్లు రోహిత్‌ (17), గిల్‌ (21) వేగంగా ఆడడంతో నాలుగు ఓవర్లలోనే భారత్‌ 30 పరుగులు చేసింది. అయితే ఆ తర్వాత వరుస ఓవర్లలో వీరిద్దరినీ పెవిలియన్‌కు చేర్చుతూ లంక షాక్‌ ఇచ్చింది. అనంతరం లంక బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారత్ బ్యాటింగ్ చేయడంలో ఇబ్బందులను ఎదుర్కొంది. ఈ క్రమంలో ఫామ్‌లో ఉన్న కోహ్లీ (4), ఐదు ఫోర్లతో జోరు మీదున్న శ్రేయాస్‌ అయ్యర్‌ (28) ఎక్కువసేపు క్రీజులో నిలవలేక పోయారు. ఈ సమయంలో కేఎల్‌ రాహుల్‌, హార్దిక్‌ పాండ్యా వికెట్‌ పడకుండా కొద్దిసేపు ఆపారు. చివరికి 35వ ఓవర్‌లో హార్దిక్‌ అవుట్‌ కాగా.. క్రీజులోకొచ్చిన అక్షర్‌ పటేల్‌ (21) బంతికో పరుగు చొప్పున సాధించి 40వ ఓవర్‌లో వెనుదిరిగాడు. ఈ క్రమంలో రాహుల్‌ ఒంటరి పోరు చేస్తూ హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. 8 ఓవర్లలో 13 రన్స్‌ అవసరమైన వేళ రాహుల్‌ 43వ ఓవర్‌లో 3 ఫోర్లు సాధించగా.. ఆ వెంటనే కుల్దీప్‌ (10 నాటౌట్‌) విన్నింగ్‌ ఫోర్‌తో మ్యాచ్‌ ముగిసింది. లంక బౌలర్లలో లాహిరు, కరుణరత్నేలు రెండు వికెట్లు తీయగా, రజిత, ధనంజయలు చెరో వికెట్ దక్కించుకున్నారు.

ఇక అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేపట్టిన శ్రీలంక ఇన్నింగ్స్‌ ఆరంభం బాగున్నా.. ఆ తర్వాత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ఆరో ఓవర్‌లోనే ఫెర్నాండో (20) అవుటయ్యాడు. అయితే మరోవైపు అరంగేట్ర ఓపెనర్‌ నువనీడు ఫెర్నాండో, కుశాల్‌ మెండిస్‌ భారత బౌలర్లపై చెలరేగారు. దీంతో 16 ఓవర్లలో 99/1 స్కోరుతో పటిష్టంగా కనిపించింది. ఈ దశలో స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్ రంగప్రవేశంతో లంక బ్యాటింగ్ కుప్పకూలింది. కుల్దీప్‌ స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు తీసి లంకను కోలుకోలేని విధంగా దెబ్బతీశాడు. చివర్లో పేసర్లు సిరాజ్‌, ఉమ్రాన్‌ టెయిలెండర్ల పనిబట్టడంతో లంక 39.4 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో సిరాజ్‌ (3/30), మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ కుల్దీప్‌ (3/51) తీయగా, ఉమ్రాన్‌కు రెండు వికెట్లు దక్కాయి.

స్కోరు బోర్డు

శ్రీలంక: అవిష్క (బి) సిరాజ్‌ 20; నువనీడు ఫెర్నాండో (రనౌట్‌) 50; కుశాల్‌ మెండిస్‌ (ఎల్బీ) కుల్దీప్‌ 34; ధనంజయ (బి) అక్షర్‌ 0; అసలంక (సి అండ్‌ బి) కుల్దీప్‌ 15; షనక (బి) కుల్దీప్‌ 2; హసరంగ (సి) అక్షర్‌ (బి) ఉమ్రాన్‌ 21; వెల్లలగె (సి) అక్షర్‌ (బి) సిరాజ్‌ 32; కరుణరత్నే (సి) అక్షర్‌ (బి) ఉమ్రాన్‌ 17; రజిత (నాటౌట్‌) 17; లాహిరు కుమార (బి) సిరాజ్‌ 0; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 39.4 ఓవర్లలో 215 ఆలౌట్‌.

బౌలింగ్‌: షమి 7-0-43-0; సిరాజ్‌ 5.4-0-30-3; హార్దిక్‌ 5-0-26-0; ఉమ్రాన్‌ 7-0-48-2; కుల్దీప్‌ 10-0-51-3; అక్షర్‌ 5-0-16-1.

భారత్‌: రోహిత్‌ (సి) మెండిస్‌ (బి) కరుణరత్నే 17; గిల్‌ (సి) అవిష్క (బి) లాహిరు 21; విరాట్‌ (బి) లాహిరు 4; శ్రేయాస్‌ (ఎల్బీ) రజిత 28; రాహుల్‌ (నాటౌట్‌) 64; హార్దిక్‌ (సి) మెండిస్‌ (బి) కరుణరత్నే 36; అక్షర్‌ (సి) కరుణరత్నే (బి) ధనంజయ 21; కుల్దీప్‌ (నాటౌట్‌) 10; ఎక్స్‌ట్రాలు: 18; మొత్తం: 43.2 ఓవర్లలో 219/6.

బౌలింగ్‌: రజిత 9-0-46-1; లాహిరు 9.2-0-64-2; కరుణరత్నే 8-0-51-2; హసరంగ 10-0-28-0; వెల్లలగె 2-0-12-0; షనక 2-0-6-0; ధనంజయ 3-0-9-1.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × two =